News June 21, 2024
HYD: గాంధీ ఆస్పత్రిలో MLA భార్య మృతదేహానికి ముగిసిన పోస్టుమార్టం

కాంగ్రెస్ నేత, చొప్పదండి MLA మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి మృతదేహానికి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో ఈరోజు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా HYD జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు గాంధీ ఆసుపత్రిని సందర్శించి పోస్టుమార్టం నిర్వహించే మార్చురీ వద్ద డాక్టర్లతో మాట్లాడారు. నిన్న రాత్రి MLA భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే.
Similar News
News March 14, 2026
హైదరాబాద్‌లో పెరిగిన ఎయిర్ పొల్యూషన్

నగరంలో గాలి నాణ్యత పడిపోతుండటంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా రెండంకెల్లో ఉండాల్సిన గాలి నాణ్యత సూచీ శనివారం అంబియాన్స్ పోర్టు హైదరాబాద్‌లో 240గా నమోదైంది. వాహనాల పొగ, చెత్తాచెదారం తగలబెట్టడం కారణంగా కాలుష్య స్థాయిలు పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. ఇటీవల మొదలైన కట్టెల పొయ్యితో మరింత క్షీణించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
News March 14, 2026
మూసీ ప్రక్షాళన: భూసేకరణ గండం.. బడ్జెట్‌లో ‘నిశ్శబ్దం’!

మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై స్పష్టత ఇవ్వడం లేదు. లండన్ థేమ్స్ నదిలా మారుస్తామన్న హామీ బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో 3,279 ఎకరాల భూసేకరణ అతిపెద్ద సవాలుగా మారింది. సుమారు 10,017 ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సి ఉండగా బాధితుల నుంచి వస్తున్న నిరసనలను అసెంబ్లీలో చర్చకు రాకుండా జాగ్రత్త పడుతోంది. నిధుల సమీకరణపై ‘గోప్యత’ పాటిస్తోంది.