News June 21, 2024
HYD: తెలంగాణ భవన్‌లో జయశంకర్ విగ్రహానికి నివాళులు

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈరోజు HYD బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో వారి విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీతో పాటు పొన్నాల లక్ష్మయ్య సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తన జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.
Similar News
News March 20, 2026
‘వేదమందిర్’కు జ్యోతిషులు కావలెను!

ప్రముఖ ఆధ్యాత్మిక వేదిక ‘వేదమందిర్’ సేవలు మరింత విస్తరించేందుకు జ్యోతిషులను నియమించుకుంటోంది. మా లక్షలాది తెలుగు భక్తులకు సరైన మార్గదర్శనం చేసేందుకు నిపుణులైన జ్యోతిషులు (Astrologers) కావలెను.
– జ్యోతిషశాస్త్రంలో మంచి పట్టు
– విషయంపై స్పష్టమైన వివరణ ఇచ్చే నైపుణ్యం
మీరు జ్యోతిష్యంలో ప్రావీణ్యం ఉన్నవారైతే వెంటనే సంప్రదించండి!
<<7337592828>>Click on Whatsapp<<>>
News March 20, 2026
HYDలో రేపటి నుంచి బంద్!

రంజాన్ మాసం సందర్భంగా పాతబస్తీలో నెల రోజులుగా సందడిగా సాగుతున్న నైట్ బజార్ రేపటితో ముగియనుంది. చార్మినార్, లాడ్ బజార్ ప్రాంతాలు రాత్రివేళల్లో కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రేపు రంజాన్ కావడంతో ఈ ప్రత్యేక నైట్ షాపింగ్‌కు తెరపడనుంది. తెల్లవారుజాము వరకు నడిచిన వ్యాపారాలు రేపటి నుంచి మిడ్‌నైట్ వరకే కొనసాగుతాయి. మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనల నేపథ్యంలో సాయంత్రం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
News March 20, 2026
ఫ్యూచర్ సిటీకి ‘పైసల’ కళ.. రియల్ ఎస్టేట్ కొత్త చిరునామా!

CM కలల ప్రాజెక్టు ‘ఫ్యూచర్ సిటీ’కి ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కురిపించనుది సర్కారు. దాదాపు 30,000 ఎకరాల్లో విస్తరించే ఈ స్మార్ట్ సిటీ కోసం ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు రూ.5,000 కోట్లను కేటాయించబోతోందని తెలుస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించే AI City, స్పోర్ట్స్ వర్సిటీకి ఇందులో సింహభాగం దక్కనుంది. కేవలం భూసేకరణకే కాకుండా RRRతో అనుసంధానించే రేడియల్ రోడ్ల కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు.


