News June 21, 2024
పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతా: మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకు వెళ్లకుండా తప్పించుకోలేరని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. ఆయన చేసిన పాపాలు పండే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మండిపడ్డారు. ‘త్వరలో సాక్ష్యాధారాలతో సహా పెద్దిరెడ్డి బాగోతం బయటపెడతా. పెద్దిరెడ్డి విముక్త రాయలసీమే నా లక్ష్యం. ఆయన అరాచకాలు లేకుండా సీమ ప్రజలను సంతోషంగా ఉంచుతా’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News January 29, 2026
RBIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<
News January 29, 2026
KCRకు నోటీసుల్లో దురుద్దేశం లేదు: మహేశ్‌గౌడ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు నోటీసులివ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ తెలిపారు. ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ అంటే గౌరవం ఉందన్నారు. ఈ కేసులో విచారణ పారదర్శకంగా జరుగుతోందని, SIT ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చన్నారు. గత CM, మంత్రుల ప్రమేయం లేకుండా అధికారులు ఫోన్ ట్యాపింగ్ చేసే ఛాన్స్ లేదని చెప్పారు. పూర్తి విచారణ జరిగితే నిజాలు బయటపడతాయని, కేసులో భాగస్వాములు ఎవరో తేలాల్సి ఉందన్నారు.
News January 29, 2026
రైల్వేలో 312 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

రైల్వే ఐసోలేటెడ్ కేటగిరీలో 312 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, డిగ్రీ, LLB, MBA, డిప్లొమా, PG(హిందీ, ఇంగ్లిష్, సైకాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. CBT(1, 2), స్కిల్ టెస్ట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.19,900-రూ.44,900 వరకు చెల్లిస్తారు. సైట్: www.rrbcdg.gov.in/


