News June 21, 2024
T20 చరిత్రలో భారత్ అరుదైన రికార్డు
T20WC సూపర్-8లో అఫ్గాన్‌పై ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 10 మంది బ్యాటర్లనూ క్యాచ్ రూపంలోనే ఔట్ చేసింది. షార్ట్ ఫార్మాట్ హిస్టరీలో భారత్ ఇలా చేయడం ఇదే తొలిసారి. రిషభ్ పంత్, రవీంద్ర జడేజా చెరో 3 క్యాచ్‌లు, రోహిత్ శర్మ 2, అర్షదీప్, అక్షర్ పటేల్ చెరో క్యాచ్ పట్టుకున్నారు.
Similar News
News January 15, 2025
ఇవాళ నాన్-వెజ్ తింటున్నారా?
సంక్రాంతి వేడుకల్లో నేడు ఆఖరి రోజు కనుమ. ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్రజలు మాంసాహారం తినడానికి మొగ్గు చూపుతారు. తెలంగాణలో చాలా మంది నిన్న సంక్రాంతి రోజు సైతం నాన్-వెజ్ లాగించేశారు. ఈ రోజు తెలంగాణతో పాటు ఏపీలో భారీ స్థాయిలో చికెన్, మటన్ కొనుగోళ్లు జరిగే అవకాశం ఉంది. స్కిన్ లెస్ చికెన్ కేజీ ధర రూ.210 నుంచి రూ.230 వరకు ఉంది. మటన్ రేటు HYDలో రూ.850పైనే ఉంది. మరి ఇవాళ మీరు నాన్-వెజ్ తింటారా? కామెంట్ చేయండి.
News January 15, 2025
IMDకి నేటితో 150 ఏళ్లు
భారత వాతావరణ విభాగం(IMD) నేడు 150వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. 1875, జనవరి 15న దీనిని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం స్థాపించింది. 1864, 1866, 1871లో తీవ్రమైన విపత్తులు సంభవించడంతో వాతావరణ పరిస్థితులను ముందుగా అంచనా వేసేందుకు దీనిని నెలకొల్పారు. వాతావరణ పరిస్థితుల్ని కచ్చితత్వంతో అంచనా వేయడంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. హిందూ మహా సముద్ర తీరంలోని 13 దేశాలతో పాటు సార్క్ దేశాలకు సేవలందిస్తోంది.
News January 15, 2025
Stock Markets: పాజిటివ్‌గా మొదలవ్వొచ్చు!
బెంచ్‌మార్క్ సూచీలు పాజిటివ్‌గా మొదలై రేంజుబౌండ్లో కదలాడే అవకాశం ఉంది. గిఫ్ట్‌నిఫ్టీ 40PTS మేర పెరగడం దీనినే సూచిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచైతే మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నేడు విడుదలయ్యే US CIP డేటా కోసం ఇన్వెస్టర్లు ఆత్రుతగా వేచిచూస్తున్నారు. దానిని బట్టే ఫెడ్ వడ్డీరేట్ల కోతపై నిర్ణయం తీసుకుంటుంది. క్రూడ్ ధరలు, బాండ్ యీల్డులు కాస్త కూల్ఆఫ్ అయ్యాయి. డాలర్ ఇండెక్స్ మాత్రం పెరుగుతూనే ఉంది.