News June 21, 2024
కృష్ణా: తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనుంది వీరే
ఉమ్మడి కృష్ణా నుంచి ఈ సారి ఆరుగురు నాయకులు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణప్రసాద్, కొలికపూడి శ్రీనివాస్, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ నుంచి సుజనా చౌదరి శాసనసభకు మొదటిసారి ఎన్నికయ్యారు. వీరిలో కృష్ణప్రసాద్(పెడన), వెంకట్రావు(గన్నవరం) 2019లో పోటీ చేసి ఓడిపోయి రెండో పర్యాయం గెలుపొందగా, మిగతా నలుగురు తొలిసారి పోటీ చేసి విజయం అందుకున్నారు.
Similar News
News November 28, 2024
పూర్తైన ఫ్లైఓవర్ పనులు.. మరింత వేగంగా హైదరాబాద్‌కు రాకపోకలు
విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిలో భాగమైన ప్రధాన ఫ్లైఓవర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కృష్ణా నదిపై సూరయపాలెం-వెంకటపాలెం మధ్య నిర్మిస్తున్న ఈ వంతెనకు ఫినిషింగ్ పనులు, బీటీ రోడ్ నిర్మించాల్సి ఉంది. ఈ వంతెన పూర్తై బైపాస్ రహదారి అందుబాటులోకి వస్తే గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు విజయవాడ రాకుండా జాతీయ రహదారిపైకి వెళ్లవచ్చు. దీంతో విజయవాడలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
News November 28, 2024
నేడు విజయవాడకు రానున్న ‘దేవకీనందన వాసుదేవ’ టీమ్
“దేవకీనందన వాసుదేవ” చిత్రబృందం నేడు విజయవాడ రానున్నారు. చిత్ర హీరో గల్లా అశోక్‌తో పాటు ఈ చిత్రంలో నటించిన పలువురు ఈరోజు సాయంత్రం 5 గంటలకు విజయవాడ చేరుకుంటారని కార్యక్రమ నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. గురునానక్ కాలనీలోని సూపర్ స్టార్ కృష్ణ విగ్రహం నుంచి ట్రెండ్‌సెట్ మాల్ వరకు మూవీ టీం ర్యాలీ, అనంతరం 6 గంటలకు ట్రెండ్‌సెట్ మాల్‌లో కేక్ కటింగ్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
News November 27, 2024
కృష్ణా: విద్యార్థులకు గమనిక.. పరీక్ష కేంద్రాలలో మార్పులు
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో నిర్వహిస్తున్న 2వ సెమిస్టర్ బీఈడీ, స్పెషల్ బీఈడీ పరీక్ష కేంద్రాలలో స్వల్ప మార్పులు చేశామని KRU తెలిపింది. యూనివర్సిటీ పరిధిలోని 7 కేంద్రాలలో బీఈడీ, ఒక కేంద్రంలో స్పెషల్ బీఈడీ పరీక్షలు జరుగుతాయని తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరీక్షల రివైజ్డ్ కేంద్రాల వివరాలకు https://kru.ac.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని సూచించింది.