News June 21, 2024

పీఎస్‌యూ స్టాక్స్ జోరు.. 10 సెషన్లలో ₹7లక్షల కోట్ల లాభం

image

ఎన్నికల ఫలితాల తర్వాత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులు ఎదుర్కొన్నా ఆ ప్రభావం ప్రభుత్వ రంగ సంస్థల స్టాక్స్‌పై పెద్దగా కనిపించలేదు. జూన్ 4-19 మధ్య 10 ట్రేడింగ్ సెషన్లలో ఈ PSU స్టాక్స్ ₹7,23,823 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. దీంతో BSEలోని 56 PSU స్టాక్స్ సంపద ₹68,03,059 కోట్లకు చేరింది. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని ఇన్వెస్టర్లలో నమ్మకం, NDA పాలసీల కొనసాగింపు ఇందుకు కారణాలని విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News March 11, 2026

ఎక్కడా గ్యాస్ కొరత లేదు: చంద్రబాబు

image

AP: స్కూళ్లు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరగాలని CM చంద్రబాబు సూచించారు. ‘ప్రస్తుతం కొరత లేదు. కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా పెట్టాలి’ అని కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. గ్యాస్, ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల అంచనాకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.

News March 11, 2026

అకౌంట్లలోకి డబ్బులు.. ఇలా చేయండి

image

ఎల్లుండి(ఈ నెల 13న) రైతుల <<19350621>>ఖాతాల్లో<<>> పీఎం కిసాన్ డబ్బులు జమ కానున్నాయి. అయితే అర్హులైన అన్నదాతలు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సూచించారు. పీఎం కిసాన్ <>పోర్టల్‌లో<<>> ఈ-కేవైసీ ఆప్షన్ సెలక్ట్ చేసుకొని ఓటీపీ/బయోమెట్రిక్‌ ద్వారా ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. ఫేస్ అథెంటికేషన్ మొబైల్ యాప్‌తోనూ సబ్మిట్ చేయొచ్చని పేర్కొన్నారు.

News March 11, 2026

చిన్నస్వామి నుంచే IPL కిక్ స్టార్ట్

image

గతేడాది తొక్కిసలాట తర్వాత బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ ఇప్పుడు IPL-2026 అక్కడి నుంచే కిక్ <<19356627>>స్టార్ట్<<>> కానుండటం గమనార్హం. తొలి మ్యాచ్‌లో RCB-SRH తలపడనున్నాయి. ఇది ఒక రకంగా RCB అభిమానులకు శుభవార్తే. నిర్వాహకులు సరైన భద్రతా చర్యలు చేపట్టాలని, ఫ్యాన్స్ కూడా హద్దులు దాటకుండా ఆటను ఆస్వాదించాలని క్రీడా విశ్లేషకులు సూచిస్తున్నారు.