News June 21, 2024
రెచ్చగొట్టే ప్రసంగాలు తప్ప.. ఉద్యోగాల చర్చ లేదు: జగ్గారెడ్డి

బీజేపీ, మంత్రులకు రెచ్చగొట్టే ప్రసంగాలు తప్పితే ఉద్యోగుల చర్చ లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. గాంధీ భవన్లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి ఐటీఐఆర్ యూపీఏ ప్రభుత్వం మంజూరు చేస్తే నరేంద్ర మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆరోపించారు. చేరికల అంశం తన పరిధిలో లేదని తెలిపారు.
Similar News
News January 28, 2026
మెదక్: రంజాన్ మాసం శాంతియుత నిర్వహణకు కలెక్టర్ ఆదేశాలు

పవిత్ర రంజాన్ మాసాన్ని ప్రశాంతంగా జరుపుకునే విధంగా జిల్లా అధికారులు సన్నాహకాలు చేపట్టనున్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షలో, మసీదులు, ప్రార్థన మందిరాల వద్ద భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, కట్టుదిట్టమైన బందోబస్తు, పారిశుద్ధ్యం, త్రాగునీటి, విద్యుత్ సరఫరా చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు.
News January 28, 2026
MDK: మెదక్ కలెక్టరేట్‌లో మీడియా సెంటర్ ప్రారంభం

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో మీడియా సెంటర్‌ను కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, అదనపు కలెక్టర్ నగేశ్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా మీడియా సెంటర్ ద్వారా అభ్యర్థుల పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారంపై నిఘా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
News January 28, 2026
ఏడుపాయల జాతర ఎల్లలు దాటేలా నిర్వహించాలి: కలెక్టర్

ఏడుపాయల వనదుర్గా మాత జాతరను ఎల్లలు దాటేలా ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమీక్షలో భక్తులకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు, సీసీ కెమెరాలు, అగ్నిమాపక ఏర్పాట్లు చేయాలని సూచించారు. అధిక ధరలు, కల్తీ ఆహారం, మత్తు పదార్థాల విక్రయంపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.


