News June 21, 2024

శ్రీకాకుళం: MA పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన MA కోర్సుల పీజీ నాల్గో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

Similar News

News March 27, 2026

శ్రీకాకుళం: వీరి ప్రేమ విషాదాంతం

image

SMలో పరిచయమైన యువకుడు, వివాహిత ప్రేమ కథ విషాదాంతమైంది. పోలీసుల వివరాల మేరకు.. ఏలూరు జిల్లా వాసి మావుళ్లయ్య (25)కు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వివాహిత రమ (35)తో ఇన్‌స్టాలో పరిచయమైంది. వీరి మధ్య ప్రేమ చిగురించగా ఇంట్లో చెప్పకుండా గోప్యంగా పెళ్లి చేసుకున్నారు. తర్వాత విషయం ఇరువురి కుటుంబ సభ్యులకు తెలియడంతో, వారు తమ ప్రేమను అంగీకరించరని చేబ్రోలు వద్ద ఉన్న గోదావరి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.

News March 27, 2026

SKLM: ఉద్యోగాలిప్పిస్తామని భారీ మోసం..!

image

పలాస(M) ఉదయపురం కాలానికి చెందిన రాజాన కూర్మారావుకు రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు అతని నుంచి రూ.లక్షల్లో నగదు కాజేసి మోసం చేశారు. ఈ ఘటనలో 2014లో పలాస పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం వాదనలు విన్న పలాస మున్సిప్ కోర్ట్ నేరం రుజువు కావడంతో నిందితులకు 6 నెలల జైలు శిక్ష, రూ.4,500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు సీఐ రామకృష్ణ తెలిపారు.

News March 26, 2026

పొందూరులో 32 ఏళ్ల యువకుడు సూసైడ్

image

పొందూరు మండలం కనిమెట్ట గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన శ్రావణ్ కుమార్(32) గురువారం ఉరివేసుకొని మృతి చెందినట్లు ఎస్సై సత్యనారాయణ పేర్కొన్నారు. కుటుంబ కలహాలు నేపథ్యంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో శ్రవణ్ ఉరివేసుకున్నట్లు ఆయన తెలిపారు. శ్రావణ్ మరణంతో తల్లిదండ్రులు, భార్య కన్నీటి పర్యంతమయ్యరు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.