News June 21, 2024
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సౌరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ అమలాపురంలోని కలెక్టరేట్ నుంచి హాజరయ్యారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపడుతున్న చర్యలు గురించి ఆయనకు కలెక్టర్ వివరించారు.
Similar News
News January 11, 2026
పెరవలి: ఆ రోజులే మళ్లీ రప్పించాయి

పెరవలి మండలంలోని కానూరు శ్రీ అక్కిన చంద్రయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005-2006 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 20 ఏళ్లకు తరువాత కలుసుకుని అప్పటి మధుర జ్ఞాపకాలను నేమరువేసుకున్నారు. చదువు చెప్పిన ఆనాటి గురువులను ఘనంగా సన్మానించారు.
News January 11, 2026
ఖేలో ఇండియాలో ఏపీకి రజతం.. దేవరపల్లి క్రీడాకారుల ప్రతిభ!

గుజరాత్‌లోని డామన్ అండ్ డయ్యూలో జరిగిన రెండవ ఖేలో ఇండియా గేమ్స్‌లో ఏపీ సెపక్ తక్రా జట్టు రెండోస్థానం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో బీహార్‌పై ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఏపీ జట్టులో ప్రతిభచాటిన దేవరపల్లి క్రీడాకారులు లక్కా గణపతి, పాటంశెట్టి సాయిలను సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరు రామారావు, హరికృష్ణ ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 11, 2026
రాజమండ్రి: ఈ నెల 13నుంచి జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డీఎమ్‌ఎమ్ శేషగిరి నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.ఈ పోటీలు 13వ తేదీ నుంచి ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.


