News June 21, 2024

అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

అద్దంకి మండలం వెంకటాపురం జాతీయ రహదారి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రేణింగవరం వైపు సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 4, 2025

ఆఫీస్‌కు వస్తే.. ముందు ఈ పని చేయండి: కలెక్టర్

image

ప్రతిరోజూ కార్యాలయానికి రాగానే ‘మీకోసం’ అర్జీల స్టేటస్ పరిశీలించటమే ప్రథమ పనిగా పెట్టుకోవాలని పలువురు జిల్లా స్థాయి అధికారులకు కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. మీకోసం అర్జీలు పరిష్కారం అవుతున్న తీరుపై సంబంధిత విభాగ అధికారులతో మంగళవారం ఒంగోలు ప్రకాశం భవనంలోని తన ఛాంబర్లో ఆయన సమీక్షించారు. అర్జీల ఆడిట్, సకాలంలో పరిష్కారం, రీఓపెన్ కాకుండా చూడాలన్నారు.

News November 4, 2025

ప్రకాశం: ఉచితంగా 3 వీలర్ మోటారు సైకిల్స్‌.. అప్లై చేయండిలా.!

image

రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి మంగళవారం తెలిపారు. ఈనెల 25లోపు www.apdascac.ap.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. 18 నుంచి 45 ఏళ్లలోపు ఉండి 70% అంగవైకల్యం కలిగినవారు అర్హులన్నారు.

News November 4, 2025

రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి విద్యార్థి ఎంపిక

image

SGFI రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పొదిలి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థి మారావతు సుదర్శన్ ఎంపికైనట్లు HM పి. కరీమున్ బీబీ తెలిపారు. సోమవారం జరిగిన జిల్లా స్థాయి చెస్ పోటీలలో ప్రతిభ కనబరచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థికి అభినందనలు తెలియజేశారు.