News June 22, 2024

మహానందిని వదలని చిరుతపులి.. స్పందించని అటవీ శాఖ అధికారులు

image

మహానంది పుణ్యక్షేత్రంలోని పార్వతిపురం టోల్‌గేట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. చిరుత సంచారంతో భక్తులు, గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోసారి చిరుత సంచారంతో ఆ మార్గంలో నడిచే భక్తులు, స్థానికులు భయపడుతున్నారు. వారం రోజులుగా చిరుత పులి మహానందిలో సంచరిస్తోందని, టోల్‌గేట్ సమీపంలో చిరుత పులి రోడ్డు దాటుతుండగా చూశామని అక్కడి స్థానికులు తెలిపారు.

Similar News

News January 11, 2026

BREAKING మద్దికేరలో ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

image

మద్దికేరలో ఆదివారం ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. పత్తికొండకు ఇటుకల లోడుతో వెళ్తుండగా బురుజుల రోడ్డు సెల్ టవర్ వద్ద ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కమలపాడుకు చెందిన బోయ కిష్టప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనంపై ఉన్న అబ్దుల్ అజీజ్, శివ గాయపడ్డారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన్నట్లు ఎస్సై హరిత తెలిపారు.

News January 11, 2026

సంక్రాంతి వేళ పందేలకు దూరంగా ఉండాలి: డీఐజీ

image

సంక్రాంతి పండగ సందర్భంగా పేకాట, జూదం, కోడి పందేలు, గుండాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని డీఐజీ, కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. సంప్రదాయ క్రీడలకే పరిమితం కావాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో కోడి పందేలు సహా అన్ని చట్టవ్యతిరేక ఆటలు పూర్తిగా నిషేధమన్నారు. పందేలు నిర్వహించినా, ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News January 11, 2026

కర్నూలు: నెల రోజుల క్రితం రూ.260.. నేడు రూ.300

image

కర్నూలులో చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. నెల క్రితం కేజీ రూ.260 ఉండగా నేడు రూ.300 పలుకుతోంది. క్రిస్మస్, న్యూ ఇయర్‌ సందర్భంగా చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. ప్రస్తుతం సంక్రాంతి, కనుమ రానుండటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 70% తెలంగాణ నుంచి బ్రాయిలర్ కోళ్లు సరఫరా అవుతున్నాయి. 25% కర్ణాటక నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. 5% మాత్రమే జిల్లాలో కోళ్ల ఉత్పత్తి అవుతోంది.