News June 22, 2024

విశాఖ: కూరగాయల ధరలపై జేసీ సమీక్ష

image

పెరుగుతున్న కూరగాయల ధరలపై కలెక్టరేట్‌లో విశాఖ జేసీ వివిధ శాఖల అధికారులు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. టమాటో, ఉల్లి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కారణంగా టమాటో దిగుబడి తగ్గినట్లు అధికారులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. మార్కెటింగ్ శాఖ జిల్లాకు కేటాయించిన రివాల్వింగ్ ఫండ్‌తో ఇతర జిల్లాల నుంచి టమాటా, ఉల్లి కొనుగోలు చేసి తక్కువ ధరలకు వినియోగదారులకు అందించాలన్నారు.

Similar News

News January 2, 2025

జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించాలి: శాప్ ఛైర్మన్

image

విశాఖ నగరానికి చెందిన అథ్లెట్ జ్యోతి యర్రాజీ అర్జున అవార్డుకు ఎంపిక కావడం తెలుగు ప్రజలకు గర్వకారణం అని శాప్ ఛైర్మన్ రవి నాయుడు అన్నారు. గురువారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ.. ఆమె పట్టుదల అంకితభావాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. భవిష్యత్తులో జ్యోతి మరిన్ని లక్ష్యాలను సాధించి యువతకు స్ఫూర్తిని ఇవ్వాలన్నారు. అర్జున అవార్డుకు ఎంపికైన ఆమెను ఆయన అభినందించారు.

News January 2, 2025

ఉ.5గంటల నుంచే ఉత్తరద్వార దర్శనం: సింహాచలం ఈవో

image

ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహాచలం ఆలయంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈనెల 10న సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉదయం 5 గంటల నుంచి పదిన్నర వరకు ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సింహాచలం ఈఓ త్రినాధరావు తెలిపారు. ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News January 2, 2025

పెందుర్తిలో దంపతుల సూసైడ్

image

పెందుర్తి మండలం పురుషోత్త పురం గ్రామంలో ఆర్థిక బాధలు తాళలేక భార్యాభర్తలు ఉరివేసుకుని చనిపోయారు. ఈ ఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి. మృతులు భర్త సంతోష్ (35), భార్య సంతోష్ శ్రీ (25)గా పెందుర్తి పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.