News June 22, 2024
ఎవరూ అధైర్య పడొద్దు: MLCతో జగన్

అసెంబ్లీ ఛాంబర్‌లో వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తినీ ఉద్దేశించి జగన్ మాట్లాడుతూ.. ఓడిపోయినందుకు ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై పోరాటం సాగించాలని కోరినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పార్టీకి అన్నివేళలా అందుబాటులో ఉంటామన్నారు.
Similar News
News January 15, 2026
నెల్లూరు: ‘నాకు రూ.5 వేలు వచ్చాయి’ అంటూ మెసేజ్ వచ్చిందా..

వాట్సాప్ గ్రూపులలో ‘నాకు రూ.5 వేలు వచ్చాయి. నేను నకిలీ అనుకున్నాను. మీరూ ప్రయత్నించి చూడండి. మీరు పది మందికి ఈ లింకును ఫార్వర్డ్ చేయండి’ అని వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని చేజర్ల ఎస్సై తిరుమలరావు పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్ మోసాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల నుంచి వచ్చే లింకులు ఓపెన్ చేయొద్దన్నారు.
News January 15, 2026
నెల్లూరు జిల్లాలో విషాదం.. తల్లీకుమారుడి మృతి

ఉదయగిరి(M)లో నిన్న <<18859378>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. దాసరపల్లికి చెందిన సయ్యద్ సాహెర(36) భర్త ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తూ ఉదయగిరిలో ఉంటున్నారు. కుమారుడు మజహర్(19)తో కలిసి సాహెర దాసరిపల్లికి వెళ్లింది. తిరిగి బైకుపై ఉదయగిరికి వస్తుండగా దుత్తలూరు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. సాహెర స్పాట్‌లోనే చనిపోయింది. మజహర్‌ను వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్తుండగా మధ్యలో కన్నుమూశాడు.
News January 15, 2026
మన నెల్లూరులో ఏమంటారంటే..?

నేడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాయన పుణ్యకాలం ప్రారంభమై పంటకోత ముగిసి ప్రకృతి, సూర్యుడికి కృతజ్ఞతలు తెలిపే పండగ ఇది. దీన్ని సంక్రాంతి అని, మకర సంక్రాంతి అని పొంగల్ అని మరికొందరు అంటారు. మన నెల్లూరు జిల్లాలో పెద్ద పండగ అంటారు. చనిపోయిన తల్లిదండ్రులకు తర్పణం వదులుతారు. వాళ్ల ఫొటోలు పెట్టి పూజలు చేస్తారు. ఉపవాసంతో నాన్ వెజ్ వండని పాత్రల్లో పవిత్రంగా ప్రసాదాలు చేసి సమర్పిస్తారు.


