News June 22, 2024
రుషికొండ ప్యాలెస్ నాకివ్వండి: చంద్రబాబుకు సుఖేశ్ లేఖ

విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను తనకు ఇవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబుకు మనీలాండరింగ్ కేసులో తిహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్ర లేఖ రాశారు. మార్కెట్ ధర కంటే 20% అదనంగా చెల్లిస్తానని, లీజుకైనా ఇవ్వాలని ఆయన కోరారు. తన లేఖను కొనుగోలు ఒప్పందంగా పరిగణించాలని తెలిపారు. తన బాల్యం విశాఖలోనే గడిచిందన్నారు. కాగా జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ ప్యాలెస్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
Similar News
News February 3, 2026
పాక్ బాయ్ కాట్.. రూ.2,200కోట్ల నష్టం

T20 WCతో భారత్ మ్యాచ్‌ను బాయ్ కాట్ చేస్తామని పాక్ ప్రకటించిన నేపథ్యంలో భారీగా నష్టం కలిగే ఛాన్సుంది. ప్రసార హక్కులు, యాడ్స్ ధరలు, స్పాన్సర్‌షిప్, టికెట్ల విక్రయాలు తదితరాలు కలుపుకొని రూ.2,200CR వరకు లాస్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు IND-పాక్ బోర్డులకు కలిపి రూ.200CR వరకు నష్టం వాటిల్లొచ్చని చెబుతున్నాయి. ఇది BCCIకి చిన్న విషయమే అయినా పాక్ బోర్డుపై తీవ్ర ప్రభావం చూపనుంది.
News February 3, 2026
ట్రంప్ టారిఫ్స్.. మనకన్నా పాక్, బంగ్లాపైనే ఎక్కువ!

ఇండియాపై విధించిన 50% టారిఫ్స్‌ను 18%కు తగ్గిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది అమెరికాతో అంటగాగే పాక్, బంగ్లా కంటే తక్కువ కావడం గమనార్హం. బ్రెజిల్‌పై 50%, మయన్మార్-40, లావోస్-40, చైనా-37, సౌతాఫ్రికా-30, వియత్నాం-20, బంగ్లాదేశ్-20, శ్రీలంక-20, పాక్-19, మలేషియా-19, కాంబోడియా-19, థాయ్‌లాండ్‌పై 19% సుంకాలను ట్రంప్ విధించారు. అతితక్కువగా UKపై 10% వసూలు చేస్తున్నారు.
News February 3, 2026
పల్నాడు జిల్లాలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<


