News June 22, 2024
T20 WC: పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు.. PCB ఏమందంటే?

లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన పాకిస్థాన్ జట్టుపై నెట్టింట ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో తమ ఆటగాళ్లను PCB వెనకేసుకొచ్చింది. తమకు ఎలాంటి అనుమానాలు లేవని, విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఆరోపణలు చేసినవారు ఆధారాలతో వస్తే విచారణ జరిపి ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అటు నిరాధార ఆరోపణలు చేసినవారికి పరువు నష్టం దావా కింద నోటీసులు పంపేందుకు PCB సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Similar News
News January 3, 2026
రూ.500 నోట్ల నిలిపివేత?.. నిజమిదే!

దేశంలో మార్చి నుంచి రూ.500 నోట్లు రద్దు కానున్నాయని జరుగుతున్న ప్రచారాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఆ నోట్ల చెలామణీ నిలిచిపోతుందన్న వార్తలన్నీ ఫేక్ అని స్పష్టం చేసింది. రూ.500 నోట్ల రద్దుపై ఆర్బీఐ ఎలాంటి ప్రకటన చేయలేదని క్లారిటీ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మి గందరగోళానికి గురి కావద్దని సూచించింది. కాగా గత జూన్‌లోనూ ఇలాంటి <<16594040>>ప్రచారమే<<>> జరిగింది.
News January 3, 2026
నవగ్రహాలను దర్శించుకొని కాళ్లు కడగకూడదా?

అలా కడగకూడదని పండితులు చెబుతుంటారు. అలా కడిగితే గ్రహాల శక్తి తరంగాలు మనపై చూపించే సానుకూల ప్రభావం, పుణ్యఫలం తగ్గిపోతుందని అంటారు. అయితే ఆలయం నుంచి ఇంటికి వెళ్లి, కొద్ది సమయం తర్వాత కడుక్కోవచ్చట. నవగ్రహాల ప్రదక్షిణలు ముగించి, కాసేపు అక్కడ కూర్చుని, ఆ గ్రహాల అనుగ్రహాన్ని స్మరించుకుని బయటకు రావాలట. ప్రదక్షిణ చేసిన వెంటనే కాళ్లు కడగడం వల్ల దోష నివారణ ప్రక్రియకు ఆటంకం కలుగుతుందని భక్తుల నమ్మకం.
News January 3, 2026
‘ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అంటే ఎట్లా?: జైశంకర్

పాక్‌తో సింధూ జలాల ఒప్పందం నిలిపేవేతపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘‘పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. మీరు సరైన నైబర్‌గా లేకపోతే ఓ మంచి పొరుగు దేశం నుంచి ప్రయోజనాలు పొందలేరు. ‘మీపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అని అడిగితే ఎట్లా?’’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు ఇండియాకు ఉందని, ఆ హక్కును ఎలా ఉపయోగించుకోవాలో ఎవరూ నిర్దేశించలేరని స్పష్టంచేశారు.


