News June 22, 2024

ప్రకాశం: 44 వేల టన్నుల ఇసుక నిల్వలు

image

జిల్లాలో ఇసుక నిల్వలను మైన్స్ శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. ప్రస్తుతం 44 వేల టన్నుల నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఒంగోలు, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, జరుగుమల్లిలో ఇసుక నిల్వ కేంద్రాలు ఉన్నాయి. ఒంగోలు మార్కెట్ యార్డులోని ఇసుక నిల్వ కేంద్రం, జరుగుమల్లిలో రెండు కేంద్రాలలో మొత్తం 44 వేల టన్నులు ఇసుక ఉన్నట్లు జిల్లా మైనింగ్ అధికారి జగన్నాథరావు చెప్పారు.

Similar News

News October 5, 2024

ప్రకాశం: టెట్‌ పరీక్షలకు 63 మంది గైర్హాజరు

image

ప్రకాశం జిల్లాలో టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు రెండో రోజు శుక్రవారం పరీక్షలకు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి బి సుభధ్ర తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సెంటర్లలో పరీక్షలు జరిగాయి. సాయంత్రం సెషన్‌లో మాత్రమే ఈ పరీక్షలు జరగ్గా, 520 మందికి గానూ 457 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈవో తెలిపారు.

News October 5, 2024

ప్రకాశం: ‘ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టండి’

image

ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు సవరణలకు సంబంధించి సెప్టెంబరు నెలాఖరు వరకు వచ్చిన దరఖాస్తులను రెండు రోజులలోగా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఆర్.శ్రీలత సంబంధిత అధికారులకు చెప్పారు. ఈ నెల 29వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించాల్సి ఉన్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబరులో ఆమె సమీక్ష నిర్వహించారు.

News October 4, 2024

జె. పంగులూరు: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి

image

బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం బోదవాడలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి చిన్నారులు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. దసరా సెలవులకు తాత గారి ఊరు వచ్చిన చిన్నారులు సాయంత్రం ఆడుకుంటూ ఇంటి వెనక ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కందుల బ్రహ్మారెడ్డి (8), కందుల సిద్ధార్థ రెడ్డి (6) మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.