News June 22, 2024
గూడూరు వద్ద కుంగిన కల్వర్టు

గూడూరు మండలం విందూరు వద్ద ఆర్ & బీ రోడ్డు మీద ఉన్న కల్వర్టు కుంగడంతో అటుగా వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గూడూరు వచ్చేందుకు దగ్గర మార్గం ఇదొక్కటే కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ కల్వర్ట్ నిర్మించిన తక్కువ కాలంలోనే ఇలా జరగడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.
Similar News
News September 13, 2025
నెల్లూరులో యువతి దారుణ హత్య!

నెల్లూరు నగరం కరెంట్ ఆఫీస్ సెంటర్లో దారుణ హత్య చోటుచేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఎదురెదురు ఇంట్లో ఉంటూ చనువుగా ఉండేవారు. గత అర్ధరాత్రి యువకుడితో మాట్లాడడానికి ఆ యువతి వెళ్లింది. ఈ క్రమంలో యువతిని పొడిచి చంపిన యువకుడు దర్గామిట్ట పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 13, 2025
ఉలవపాడు: జ్యువెలరీ షాప్ సిబ్బందిని బురిడి కొట్టించిన కిలా(లే)డీలు

ఉలవపాడులోని ఓ జ్యువెలరీ షాప్లో శుక్రవారం 4 జతల బంగారు కమ్మలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు అందింది. బంగారు కమ్మలు కొనడానికి వచ్చినట్లు నటించిన ఇద్దరు మహిళలు షాపు సిబ్బందిని బురిడి కొట్టించి 4 జతల గోల్డ్ కమ్మలు మాయం చేశారు. ఆ తర్వాత గుర్తించిన షాపు సిబ్బంది రూ.లక్ష విలువైన సొత్తు చోరీ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు SI అంకమ్మ తెలిపారు.
News September 12, 2025
ఆశించిన స్థాయిలో లేని చేప పిల్లల పెంపకం

నెల్లూరు జిల్లాలో సుమారు 78 సొసైటీలు, 110 పంచాయతీ చెరువులు ఉన్నాయి. సోమశిల రిజర్వాయర్ నిండడంతో కింది చెరువులకు ఇబ్బంది ఉండదని అధికారులు తెలిపారు. అయితే చేప పిల్లల పెంపకం కేంద్రాలను గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతో ప్రస్తుతం 20 లక్షల చేప పిల్లల లక్ష్యం సాధ్యం కాకపోతోంది. సోమశిల, పడుగుపాడు కేంద్రాలు మూతపడి భవనాలు శిథిలమయ్యాయి. ప్రస్తుతం కొద్దిపాటి తొట్టెల్లోనే పిల్లల పెంపకం జరుగుతోంది.