News June 22, 2024

వైసీపీది బాధ్యతారాహిత్యం: సత్యకుమార్

image

AP: సభాపతి స్థానానికి అయ్యన్నపాత్రుడు అన్ని విధాలా అర్హులని మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..’ అల్లరిని అరికట్టే ప్రిన్సిపల్‌గా అయ్యన్న వ్యవహరించాలి. ఆయన అనుభవం కొత్త సభ్యులకు మార్గదర్శకం కావాలి’ అని అన్నారు. సభాపతి బాధ్యతలు చేపట్టే ముఖ్యమైన ఘట్టానికి YCP హాజరుకాకపోవడం సరికాదని అన్నారు. ఇది ఆ పార్టీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు.

Similar News

News October 9, 2024

నేడు టీడీపీలో చేరనున్న మస్తాన్ రావు, మోపిదేవి

image

AP: వైసీపీ మాజీ రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ నేడు టీడీపీలో చేరనున్నారు. ఉండవల్లిలోని నివాసంలో వారిద్దరికి సీఎం చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వీరిద్దరూ వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.

News October 9, 2024

INDvsBAN: కొట్టేస్తారా? ఛాన్సిస్తారా?

image

భారత్, బంగ్లాదేశ్‌ మధ్య 3 మ్యాచ్‌ల T20 సిరీస్‌లో 2వ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఈనెల 6న జరిగిన తొలి T20లో భారత్ గెలిచింది. ఈరోజు భారత్ గెలిస్తే సిరీస్ వశం కానుంది. బంగ్లా గెలిస్తే సిరీస్ 1-1గా మారి 3వ మ్యాచ్ కీలకంగా మారుతుంది. ఈనేపథ్యంలోనే నేటి మ్యాచ్‌లో గెలవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. మరి భారత్ గెలిచి సిరీస్ వశం చేసుకుంటుందా? లేక బంగ్లాకు ఛాన్స్ ఇస్తుందా? వేచి చూడాలి. రా.7గంటలకు మ్యాచ్ ప్రారంభం.

News October 9, 2024

మరో కొత్త కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం?

image

TG: మహిళా సంఘాలను బలోపేతం చేసే దిశగా రేవంత్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి వారి ద్వారా బస్సులను కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలో దీనిని అమలు చేయాలని నిర్ణయించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.