News June 22, 2024

ఇండియాvsబంగ్లాదేశ్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి?

image

T20WCలో ఈరోజు 8pmకు భారత్, బంగ్లాదేశ్ మధ్య సూపర్8 మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ జరిగే ఆంటిగ్వాలో వర్షం వచ్చే ఛాన్స్ ఉందని AccuWeather తెలిపింది. 7.30pmకి 46%, 8.30pmకి 51%, 12.00amకి 47% వర్షం వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అఫ్గానిస్థాన్‌పై గెలిచిన భారత్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీస్ బెర్తు దాదాపు ఖరారవుతుంది. అటు బంగ్లాదేశ్ గత మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.

Similar News

News January 26, 2026

కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

image

<>కొచ్చిన్<<>> పోర్ట్ అథారిటీ 7 మెరైన్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు FEB 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ(ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/మ్యాథ్స్), బీటెక్(మెరైన్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 35-40ఏళ్ల మధ్య ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://www.cochinport.gov.in

News January 26, 2026

ఇంటింటికీ ‘Prestige’.. ఫౌండర్‌కు పద్మశ్రీ

image

వంటింట్లో ఉండే వస్తువుల్లో ప్రెషర్ కుక్కర్ ఒకటి. అలాంటి ప్రెషర్ కుక్కర్‌ను మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత టీటీకే ప్రెస్టీజ్‌ గ్రూప్ అధినేత జగన్నాథానికి దక్కుతుంది. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించిన కేంద్రం మరణానంతరం పద్మశ్రీతో గౌరవించింది. ప్రెషర్ కుక్కర్స్‌లో సేఫ్టీ మెకానిజాన్ని ఆవిష్కరించిన ఆయన ప్రెస్టీజ్‌కు బ్రాండ్‌ను క్రియేట్ చేసి ‘కిచెన్ మొఘల్’ అయ్యారు.

News January 26, 2026

బీర సాగులో విత్తనశుద్ధి, ఎరువుల మోతాదు

image

కిలో విత్తనానికి థైరమ్ 3 గ్రా., ఇమిడాక్లోప్రిడ్ 5గ్రా. చొప్పున ఒక దాని తర్వాత మరొకటి కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత 100గ్రా. విత్తనానికి 2గ్రా. ట్రైకోడెర్మావిరిడేతో విత్తనశుద్ధి చేయాలి. విత్తడానికి ముందు ఎకరాకు 8-10 టన్నుల పశువుల ఎరువు 32-40 కిలోల భాస్వరం, 16- 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను వేసుకోవాలి. నత్రజనిని రెండు సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుంచి 30 రోజులకు, పూత పిందె దశలో వేసుకోవాలి.