News June 22, 2024
అమలాపురంలో 24వ తేదీన జాబ్‌మేళా
అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 24వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వసంతలక్ష్మి తెలిపారు. ఆ రోజు ఉదయం 10:30 నుంచి మేళా ప్రారంభమవుతుందని చెప్పారు. పదవ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, డిప్లమా ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు.
Similar News
News January 3, 2025
తూ.గో: నేడు మంత్రి అచ్చెనాయుడు జిల్లా పర్యటన
రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి అచ్చం నాయుడు సామర్లకోట పర్యటన ఖరారు అయింది. ఈ మేరకు మంత్రి పర్యటన వివరాలను సమాచార శాఖ విడుదల చేశారు. జనవరి మూడో తేదీన మంత్రి అచ్చం నాయుడు రావులపాలెం మీదుగా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామానికి రానున్నారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సామర్లకోట చేరుకుంటారు. సామర్లకోటలో సహకార భవనాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 4:30కి కాకినాడ బయలుదేరి వెళ్తారు
News January 2, 2025
గండేపల్లి : అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
గండేపల్లి మండలం మురారి వద్ద బుధవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో రాజమండ్రిలోని మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. జగ్గంపేట వైపు నుంచి బైకుపై రాజమండ్రికి వెళ్తున్న వారు మురారి వద్ద డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో నవీన్ చంద్ అక్కడిక్కడే మృతి చెందగా, సంతోశ్ జీఎస్ఎల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.
News January 2, 2025
నల్లజర్ల: సినిమా ముహూర్తాల సిద్ధాంతి సత్యనారాయణ కన్నుమూత
నల్లజర్ల మండలం సింగరాజుపాలేనికి చెందిన ప్రముఖ సిద్ధాంతి కొఠారు సత్యనారాయణ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆయన జ్యోతిష్య, వాస్తు, సినిమాకు ముహూర్తాలు పెట్టడంతో జిల్లా వాసులకు సుపరిచితుడు.