News June 22, 2024
అసెంబ్లీ నిరవధిక వాయిదా

AP: అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఈరోజు సమావేశం ప్రారంభం కాగానే స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు పలువురు మంత్రులు పలు అంశాలపై సభలో మాట్లాడారు. కాగా ఈరోజు వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరయ్యారు.
Similar News
News January 12, 2026
లాభాల్లోకి స్టాక్ మార్కెట్స్

నష్టాలతో మొదలైన భారత స్టాక్ మార్కెట్ సూచీలు తిరిగి పుంజుకున్నాయి. ప్రారంభ సమయంలో సెన్సెక్స్ 500 పాయింట్లు, నిఫ్టీ 127 పాయింట్లు కోల్పోయింది. అలాంటి పరిస్థితి నుంచి సెన్సెక్స్ 60కి పైగా పాయింట్లు లాభపడి 83,640 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 40కి పైగా పాయింట్లు ఎగబాకి 25,725 వద్ద కొనసాగుతోంది.
News January 12, 2026
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL)లో 7 సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి బీటెక్(మైనింగ్), బీఈ, పీజీ(ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్), పీజీ, పీహెచ్‌డీ(జియాలజీ), ఎంఏ( హిందీ, ఇంగ్లిష్), MBBS, MD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఈ మెయిల్ careershindcopper@gmail.comకు దరఖాస్తుతో పాటు డాక్యుమెంట్స్ పంపాలి. వెబ్‌సైట్: hindustancopper.com/
News January 12, 2026
అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు నోటీసులు 1/2

TG: రాష్ట్రంలో 2వేల ఏజెన్సీల పరిధిలో 4L మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరి ఆధార్, వేతన వివరాలను EX CS శాంతికుమారి కమిటీ సేకరించింది. అయితే ఏజెన్సీలు EPF, ESIలకు నిధులు జమచేయడం లేదని గుర్తించింది. ఆ అకౌంట్ల వివరాలివ్వాలని, లేకుంటే బ్లాక్ లిస్టులో పెడతామని తాజాగా నోటీసులిచ్చింది. ఇవి అందితే వాటి అవినీతి బాగోతం బయటపడనుంది. దీంతో ఏజెన్సీలు అకౌంట్లు తెరిచే పనిలో పడ్డాయి.


