News June 22, 2024

ప్రొద్దుటూరులో వ్యక్తి దారుణ హత్య

image

ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరం రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య ఘటన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. అర్షద్ (37) అనే వ్యక్తి రామేశ్వరం రోడ్డు వద్ద ఉన్న మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 13, 2026

కడప జిల్లాలో 99,508 హెక్టార్లలో రబీ పంటల సాగు

image

జిల్లాలో రబీ పంటల సాగు సాధారణ విస్తీర్ణం 1,39,796 హెక్టార్లు కాగా, ఈ ఏడాది
99,508 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పప్పు సెనగ 68,207, మినుము 12,421, మొక్కజొన్న 5,390, వరి 4,223, జొన్న 2,110, కుసుమ 1.970, వేరుశనగ 1,259, గోధుమ 28, సజ్జ 783, రాగి 115, కొర్ర 81, కంది 143, పెసర 949, ప్రొద్దుతిరుగుడు 422, పత్తి 248 హెక్టార్లలో సాగయ్యింది. గత ఏడాది 1,10,776 హెక్టార్లలో సాగైనట్లు అధికారులు తెలిపారు.

News January 13, 2026

కడప జిల్లాలో డ్రైనేజీల అభివృద్ధికి నిధులు మంజూరు

image

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీల ఆధునీకరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రొద్దుటూరు మునిసిపాలిటీకి రూ.65.09 కోట్లు నిధులు మంజూరయ్యాయని స్థానిక మునిసిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు. కడపకు రూ.100 కోట్లు, బద్వేల్ రూ.31.97 కోట్లు, రాజంపేట రూ.21.62 కోట్లు, జమ్మలమడుగు రూ.21.16 కోట్లు, పులివెందుల రూ.28.91 కోట్లు, ఎర్రగుంట్ల రూ.38.06 కోట్లు మంజూరయ్యాయన్నారు.

News January 13, 2026

ప్రొద్దుటూరు నూతన DSPగా విభూ కృష్ణ

image

కడప జిల్లా ప్రొద్దుటూరు DSP భావనను అధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విభూ కృష్ణను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. డీఎస్పీ ఇతర పోలీసు అధికారులపై ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి బహిరంగంగా పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే బదిలీ చేశారని తెలుస్తోంది. విభూ కృష్ణ ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా ఉన్నారు. త్వరలో DSP బాధ్యతలు స్వీకరించనున్నారు.