News June 22, 2024
నందవరం అటవీ ప్రాంతంలో పులి కలకలం

మర్రిపాడు మండలం నందవరం అటవీ ప్రాంతంలో ఏఎమ్ఆర్ గార్డెన్ వద్ద పులి కనబడిందని శనివారం స్థానికంగా కలకలం రేగింది. ఓ వ్యక్తి పులిని చూసినట్లు గ్రామస్థులకు తెలిపాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. అధికారులు అది పులి కాదని ఐన అనే జంతువు అని నిర్ధారించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అటవీశాఖ అధికారులు తెలిపారు.
Similar News
News September 14, 2025
MLA సోమిరెడ్డిపై కాకాణి ఆరోపణలు

రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విఫలమయ్యారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తోటపల్లి గూడూరు మండలం వరిగొండ గ్రామంలో ఆయన పర్యటించారు. ట్రావెల్, మట్టి, ఇసుక, బూడిదను దోపిడీ చేస్తూ సోమిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
News September 13, 2025
కాసేపట్లో కొత్త కలెక్టర్ బాధ్యతలు.. సమస్యలు ఇవే.!

నెల్లూరు కొత్త కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా శనివారం సా.5.30 గం.కు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయనకు పలు కీలక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. GGHలో అధ్వాన పరిస్థితులు, కరేడు భూముల వివాదం, సీజనల్ వ్యాధుల కట్టడి, ఆస్పత్రుల సేవల మెరుగు, పెన్నా పొర్లుకట్టలు, చెరువుల పటిష్టత, ఇసుక అక్రమ రవాణా, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, రెవెన్యూ సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. వాటిపై ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
News September 13, 2025
నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ

నెల్లూరు SP కృష్ణకాంత్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అజిత వేజెండ్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 14 జిల్లాల SPలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.