News June 22, 2024
శ్రీకాకుళం: మంత్రి వెంకటస్వామికి ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు

నగరానికి చెందిన సంఘ సేవకుడు డాక్టర్ మంత్రి వెంకటస్వామిని ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు వరించింది. ఆస్ట్రో, మెడికల్, రత్నాల శాస్త్రవేత్తగా వెంకటస్వామి 4దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇంటర్నేషనల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఫెడరేషన్ బృందం ప్రకటించింది. ఈ నెల 23న ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వెంకటస్వామికి ఈ అవార్డు అందజేస్తారు.
Similar News
News January 12, 2026
కాశీబుగ్గ: చిన్న తిరుపతి వెంకన్నకు కష్టాలు తప్పవా?

తిరుపతిలోని వేంకటేశ్వురుడి దర్శనం జరగనందున ఆవేదన చెంది కాశీబుగ్గలో ఏకంగా ఆ శ్రీనివాసుడికి ధర్మకర్త పండా గుడి కట్టారు. భక్తుల దర్శనాలు జరుగుతున్న క్రమంలో..గతేడాది NOV1న తొక్కిసలాటలో 9 మంది మృతి చెందగా ఆలయాన్ని మూసేశారు. పునఃప్రారంభానికి శరవేగంగా పనులవుతున్నాయి. ఇంతలోనే భారీ <<18834092>>చోరీ<<>> జరిగింది. పూజలందుకోవాల్సిన వెంకన్నకు కష్టాలు తప్పడం లేదని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.
News January 12, 2026
అంతర్జాతీయ బ్యాడింటన్ పోటీలకు అంపైర్‌గా కవిటి వాసి

కవిటి గ్రామానికి చెందిన తుంగాన శరత్ ఇండియా ఓపెన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నమెంటుకు అంపైర్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 13-18 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగే పోటీలకు ఆయన అంపైర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఎంపికకు సంబంధించి రాష్ట్ర, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ల నుంచి ఆదివారం అధికారిక ఉత్తర్వులు అందినట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జయరాం తెలిపారు.
News January 12, 2026
శ్రీకాకుళం: జనరల్ బోగీలతో ప్రత్యేక రైలు..ఈ నెల18 వరకే ఛాన్స్

సంక్రాతి వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల12-18 వరకు జనసాధారణ్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు వాల్టేర్ డివిజన్ సీనియర్ డీసీ పవన్ కుమార్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖ-విజయవాడ(08567-68) ట్రైన్ విశాఖలో ఉదయం 10గం.లకు బయలుదేరి సాయంత్రం 4గం.టలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ మధ్య సాయంత్రం 6.30. గంలకు ప్రారంభమై అర్ధరాత్రి12.30 గం.ల వరకు నడవనుంది.


