News June 22, 2024

తిరుమల శ్రీవారి ప్రసాదానికి సిక్కోలు బెల్లం

image

ఆముదాలవలస మండలం నిమ్మతోర్లాడ గ్రామంలో స్థానిక రైతులు పూర్తిగా ప్రకృతి సేద్యం ద్వారా బెల్లం తయారు చేస్తున్నారు. శ్రీవారి ప్రసాద పంపిణీలో ఈ బెల్లం వినియోగించేందుకు ఇటీవల అధికారులు దీని నాణ్యతను పరీక్షించారు. పూర్తి నాణ్యతగల బెల్లం కావడంతో శనివారం శ్రీవారి ప్రసాద వితరణకు ఆ బెల్లాన్ని తరలించారు. ఇది యావత్ సిక్కోలు ప్రజానీకానికి గర్వకారణమని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 8, 2025

టెక్కలి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

image

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.

News November 8, 2025

శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

image

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.

News November 8, 2025

కనుమరుగైన బాలి యాత్ర..పున:ప్రారంభం వెనక కథ ఇదే

image

శ్రీముఖలింగంలో రేపు జరిగే బాలియాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 వేల ఏళ్ల క్రితం వదిలేసిన యాత్రను ఇటీవల ప్రారంభించారు. మహానది-గోదావరి వరకు గల కళింగాంధ్రాను ఖౌరవేలుడు పరిపాలించాడు. ఆయన కాలంలో శ్రీముఖలింగం ఆలయ సమీపాన వంశధార నది నుంచి వర్తకులు పంటలతో ఇండోనేషియాలో బాలికి వెళ్లేవారు. వారు క్షేమంగా రావాలని కార్తీక మాసంలో అరటి తెప్పల దీపాన్ని కుటుంబీకులు నదిలో విడిచిపెట్టడమే యాత్ర వృత్తాంతం.