News June 22, 2024
భారత్ సాయంతోనే కోలుకున్నాం: విక్రమసింఘే
భారత్ అందించిన 3.5 బిలియన్ డాలర్ల సాయంతోనే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడ్డామని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే చెప్పారు. ఇందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామన్నారు. కొలంబోలో జరిగిన అఖిల భారత భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇదే విషయంపై ప్రధాని మోదీతో చర్చించినట్లు వివరించారు.
Similar News
News January 20, 2025
సిగ్నల్ లేకపోయినా కాల్ మాట్లాడొచ్చు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇంటర్-సర్కిల్ రోమింగ్‌ను ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్‌టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులకు సిగ్నలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 4G నెట్‌వర్క్ అందిస్తుంది. యూజర్ వాడే సిమ్‌లో నెట్‌వర్క్ లేకపోయినా అందుబాటులో ఉన్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉపయోగించి కాల్స్ చేసుకోవచ్చు. ఈ సదుపాయం టెలికం యూజర్లకు ఎంతో ఉపయోగపడనుంది.
News January 20, 2025
బాబా రామ్‌దేవ్‌పై అరెస్ట్ వారెంట్
బాబా రామ్ దేవ్, పతంజలి MD ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద అనుబంధ సంస్థ దివ్య ఫార్మసీ తప్పుదారి పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో అరెస్ట్ చేయాలని ఆదేశించింది. మందులు, వ్యాధుల నివారణపై దివ్య ఫార్మసీ తప్పుడు ప్రకటనలు ఇస్తున్నట్లు ఆ రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి కోర్టు ముందు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
News January 20, 2025
షూటింగ్ సెట్‌లో ప్రమాదం.. ఇద్దరు హీరోలకు గాయాలు
బాలీవుడ్ హీరోలు అర్జున్ కపూర్, జాకీ భగ్నానీ గాయపడ్డారు. ‘మేరే హస్బెండ్ కి బీవి’ మూవీ షూటింగ్ సందర్భంగా సెట్ పైకప్పు కూలింది. దీంతో వీరిద్దరికీ గాయాలయ్యాయి. ఈ ఘటనపై స్పందించిన వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు BN తివారీ అదృష్టవశాత్తు నటులకు తీవ్ర గాయాలు కాలేదని చెప్పారు. అయితే షూటింగ్‌ల సమయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.