News June 22, 2024

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డికి కీలక పదవీ

image

TDP పార్లమెంటరీ కోశాధికారిగా నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియమితులయ్యారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ పార్లమెంటరీ పార్టీ తొలిసారి సమావేశమైంది. సమావేశానికి టీడీపీ ఎంపీలు, సీనియర్ నేతలు, మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. తనపై నమ్మకంతో TDP పార్లమెంటరీ పార్టీ ట్రెజరర్‌గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

Similar News

News January 13, 2026

నెల్లూరు జిల్లాలో MROలు పట్టించుకోవడం లేదు..!

image

అనంతసాగరం లింగంగుట్టలో 2022లో రీసర్వే చేసి 1B భూములను చుక్కల భూములుగా తేల్చారు. 114మందికి చెందిన భూములను ఒకే వ్యక్తి కిందకు చేర్చారు. బాధితులకు 1బీ అడంగల్ అందక, రిజిస్ట్రేషన్లు జరగక అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. నెల్లూరులో సోమవారం JCకి అర్జీ ఇవ్వగా.. వీటిని MRO, RDO లాగిన్‌లోనే చేయాలని చెప్పారు. MRO, RDOలకు ఈ అంశంలో ఫుల్ పవర్స్ ఇచ్చినా బాధితులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

News January 13, 2026

నెల్లూరులో భార్య పోలీస్.. భర్త దొంగ!

image

నెల్లూరులో కార్ల <<18838353>>దొంగతనం <<>>వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఓ కారు షోరూమ్‌లో పనిచేసే లక్ష్మణ్ కుమార్, కారు మెకానిక్ శివ(నెల్లూరు బీవీనగర్‌), A1 నిందితుడు ఫ్రెండ్స్. ఢిల్లీ, ముంబయిలో A1 కార్లు చోరీ చేసి నెల్లూరుకు తెస్తే ఈ ఇద్దరూ AP, TS నంబర్ ప్లేట్లు మార్చి తక్కువ రేటుకు అమ్మేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే A1 ఓ లేడీ కానిస్టేబుల్ భర్త అని సమాచారం. అతనిపై చాలా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

News January 13, 2026

నెల్లూరు ఎస్పీ గ్రీవెన్స్‌కి 105 అర్జీలు

image

నెల్లూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే సోమవారం నిర్వహించారు. ఎస్పీ అజిత వేజెండ్ల బాధితుల నుంచి స్వయంగా అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 105 అర్జీలు వచ్చాయని తెలిపారు. వాటిలో ఎక్కువగా చీటింగ్ కేసులకు సంభందించి అర్జీలు వచ్చాయి. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారీగా ఉండి సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించాలని అధికారులను కోరారు.