News June 22, 2024

BREAKING: నీట్ పీజీ పరీక్ష వాయిదా

image

రేపు(ఆదివారం) జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేసినట్లు NTA ప్రకటించింది. త్వరలో కొత్త తేదీని వెల్లడిస్తామని తెలిపింది. ఇటీవల నీట్ యూజీ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో NTA డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్‌ను కేంద్రం ఇవాళ పదవి నుంచి తొలగించింది.

Similar News

News October 9, 2024

ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిసైల్స్ అటాక్

image

సిరియా డమాస్కస్‌లోని ఇరాన్ ఎంబసీ సమీపంలో ఇజ్రాయెల్ మిలిటరీ ఎయిర్‌స్ట్రైక్స్ చేపట్టింది. వెపన్స్ స్మగ్లింగ్‌లో జోక్యం ఉన్న హై ర్యాంకింగ్ హెజ్బొల్లా టెర్రరిస్టే లక్ష్యంగా దాడి చేసినట్టు తెలిసింది. సిరియా న్యూస్ ఏజెన్సీ SANA దీనిని కన్ఫమ్ చేసింది. ఫారిన్ ఎంబసీ దగ్గర్లోని కమర్షియల్ బిల్డింగ్‌పై ఇజ్రాయెల్ 3 మిసైళ్లు ప్రయోగించినట్టు తెలిపింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారని వెల్లడించింది.

News October 9, 2024

హరియాణాలో కాంగ్రెస్‌కు పెరిగిన ఆదరణ

image

హరియాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇక్కడ BJP-కాంగ్రెస్ మధ్య 11 సీట్ల తేడా ఉన్నప్పటికీ ఓటు షేర్‌లో రెండింటికీ 39% వచ్చింది. 2019లో కాంగ్రెస్‌కు 28.08% ఓట్లు రాగా, ప్రస్తుతం గణనీయంగా ఆదరణ పెరిగింది. BJP గత ఎన్నికల్లో 36.49% ఓటు బ్యాంక్‌తో 40సీట్లు గెలుచుకుంది. జననాయక్ జనతా పార్టీకి 2019లో 14.80% ఓట్లతో 10సీట్లలో విజయఢంకా మోగించింది.

News October 9, 2024

వడ్డీరేట్లు తగ్గించని RBI..

image

అక్టోబర్ పాలసీ మీటింగ్‌లోనూ రెపోరేట్లపై ఆర్బీఐ స్టేటస్ కో ప్రకటించింది. వడ్డీరేట్లను తగ్గించడం లేదని గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. రెపోరేటును 6.5% వద్ద యథాతథంగా ఉంచుతున్నామని పేర్కొన్నారు. న్యూట్రల్ వైఖరినే అవలంబిస్తున్నామని చెప్పారు. ఇన్‌ఫ్లేషన్ తగ్గుదల ఇంకా నెమ్మదిగా, అసాధారణంగానే ఉందన్నారు. యూఎస్ ఫెడ్ 50 బేసిస్ పాయింట్ల మేర కత్తిరించినా ఆర్బీఐ ఆచితూచి వ్యవహరిస్తోంది.