News June 22, 2024
బంగ్లాపై టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ

టీ20 వరల్డ్ కప్ సూపర్-8లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఆ జట్టును 50 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో టీమ్ ఇండియా సెమీస్‌కు చేరువగా వెళ్లింది. 197 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా ఓవర్లన్నీ ఆడి 146/8కే పరిమితమైంది. ఆ జట్టులో నజ్ముల్ హుస్సేన్ శాంటో (40) రాణించారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా 2, అర్ష్‌దీప్ 2 వికెట్లతో చెలరేగారు.
Similar News
News January 1, 2026
అందుకే దాస్‌పై ఆరోపణలు: CM రేవంత్

TG: పాలమూరు-RR ప్రాజెక్టు వివాదం వేళ వార్తల్లో నిలిచిన ఇరిగేషన్ సలహాదారు <<18689807>>ఆదిత్యనాథ్<<>> దాస్ గురించి CM రేవంత్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులపై ఆయనకు అవగాహన ఉండటంతోనే AP నుంచి తీసుకొచ్చామన్నారు. ఆయనది అటు ఏపీ, ఇటు తెలంగాణ కాదని, దాస్ బిహార్‌కు చెందినవాడని తెలిపారు. కేసీఆర్, హరీశ్ రావు దొంగతనాన్ని బయటపెడతాడనే భయంతోనే ఆయనపై BRS నేతలు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
News January 1, 2026
మద్యం విక్రయాలకు న్యూ ఇయర్ కిక్కు

AP: మద్యం అమ్మకాలు డిసెంబర్(2025)లో గణనీయంగా పెరిగి ₹2,767 కోట్ల ఆదాయం సమకూరింది. 2024లో ఇదే నెలలో ₹2,568 కోట్లు వచ్చాయి. న్యూ ఇయర్ వేడుకలు, వరుస సెలవుల రాకతో 29, 30, 31 తేదీల్లో ఏకంగా ₹543 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 2024లో ఇది ₹336 కోట్లు మాత్రమే. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో ₹178.6 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు కొనుగోలు చేశారు.
News January 1, 2026
KCR అసెంబ్లీకి రావాలి.. ఎలాంటి ఆటంకం కలిగించం: సీఎం రేవంత్

TG: జల వివాదాలపై మాట్లాడేందుకు BRS చీఫ్, మాజీ సీఎం KCR అసెంబ్లీకి రావాలని సీఎం రేవంత్ అన్నారు. సభలో ఆయన గౌరవానికి, వాదనలకు ఎలాంటి ఆటంకం కలిగించబోమని స్పష్టం చేశారు. ‘ఎవరి బాగు కోసం పాలమూరు ప్రాజెక్టు ఎత్తిపోతల సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. కమీషన్లు ఎవరికి వెళ్లాయి. దీనిపై విచారణ జరగాలి’ అని వ్యాఖ్యానించారు. అబద్ధాల పోటీలో KCR, KTR, హరీశ్ రావుకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందన్నారు.


