News June 23, 2024
రోహిత్ శర్మ విజయాల పరంపర..!

ఐసీసీ టోర్నమెంట్లలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన విజయాల పరంపర కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆయన 24 మ్యాచులకు సారథ్యం వహించారు. అందులో 19 గెలుపు, 4 ఓటములు, ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. విన్నింగ్ పర్సంటేజీ ఏకంగా 86.36 శాతంగా ఉంది. ప్రపంచ క్రికెట్‌లో మరే కెప్టెన్‌కు ఇంత విన్నింగ్ పర్సంటేజీ లేదు. కాగా టీమ్ ఇండియా కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ అసాధారణ విజయాలు అందిస్తుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Similar News
News January 28, 2026
మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 28, 2026
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంగా..

విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ సుదీర్ఘ కాలం పాటు Dy.CMగా కొనసాగారు. పృథ్వీరాజ్ చవాన్(కాంగ్రెస్-NCP), దేవేంద్ర ఫడణవీస్(NDA-2 సార్లు), ఉద్ధవ్ ఠాక్రే(MVA), ఏక్‌నాథ్ షిండే(NDA) ప్రభుత్వాల్లో డిప్యూటీ CMగా పని చేశారు. శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ బారామతి నుంచి 1991లో తొలిసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. బారామతి అసెంబ్లీ సీటు నుంచి 7 సార్లు గెలిచారు.
News January 28, 2026
నిద్రలో శివుడు కనిపిస్తే..?

కలలో శివుడు కనిపించడం అదృష్టమని స్వప్న శాస్త్రం చెబుతోంది. శివుడికి సంబంధించి ఏ వస్తువు కనిపించినా కష్టాలు తీరుతాయని, త్వరలోనే శుభవార్తలు వింటారని అర్థం. శివలింగం కనిపిస్తే చేపట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. గర్భవతులకు శివలింగం కనిపిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. శివాలయం కనిపిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఈశ్వరుడు కలలో రావడం భవిష్యత్తులో జరగబోయే శుభపరిణామాలకు సంకేతం.


