News June 23, 2024

షారుక్ సినిమాలో సమంత?

image

షారుక్ ఖాన్ సినిమాలో సమంత నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ మూవీని రాజ్‌కుమార్ హిరానీ తెరకెక్కించనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. యాక్షన్-అడ్వెంచర్-పాట్రియాటిక్ అంశాలు మిళితమైన కథతో ఈ మూవీ రూపొందనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షారుక్-హిరానీ కలిసి చేసిన ‘డంకీ’ గతేడాది విడుదలై మంచి వసూళ్లు సాధించింది. కాగా సమంత ‘ఖుషి’ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

Similar News

News February 6, 2026

రియల్ ఎస్టేట్‌కు RBI బూస్ట్.. REITsకు నేరుగా లోన్లు

image

రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (REITs)లకు బ్యాంకులు నేరుగా లోన్లు ఇచ్చేందుకు RBI అనుమతించనుంది. ఇది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు ఇవ్వనుంది. ఇప్పటివరకు కేవలం బాండ్లు, ఈక్విటీలపై ఆధారపడ్డ REITs ఇకపై బ్యాంకులనుంచి తక్కువ వడ్డీకే లాంగ్ టర్మ్ లోన్లు పొందొచ్చు. దీంతో ఆఫీస్ బిల్డింగ్స్, మాల్స్ వంటి ప్రాజెక్టులను చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేయొచ్చు. కమర్షియల్ రియల్ ఎస్టేట్ మరింత బలోపేతం అవుతుంది.

News February 6, 2026

₹120 కోట్లకు ‘టాక్సిక్’ తెలుగు రైట్స్!

image

KGF-2 తర్వాత వస్తున్న సినిమా కావడంతో యష్ Toxicపై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను నిర్మాత దిల్ రాజుకు చెందిన SVC దక్కించుకుంది. దాదాపు ₹120 కోట్లకు (Advance Commission పద్ధతిలో) సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే ఒక నాన్-తెలుగు సినిమాకు మన దగ్గర ఈ రేంజ్ డీల్ జరగడం ఇదే తొలిసారి. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీని మార్చి 19న రిలీజ్ చేయనున్నారు.

News February 6, 2026

OFFICIAL: హర్షిత్ స్థానంలో సిరాజ్

image

T20 WC-2026కు హర్షిత్ రాణా <<19066790>>దూరం<<>> అయ్యారని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 4న SAతో వార్మప్ మ్యాచ్ సందర్భంగా అతడికి గాయమైందని పేర్కొంది. హర్షిత్ స్థానంలో సిరాజ్‌ను తీసుకున్నామని తెలిపింది.
అప్‌డేటెడ్ స్క్వాడ్: సూర్య (C), అభిషేక్ శర్మ, శాంసన్, ఇషాన్, తిలక్, హార్దిక్, దూబే, అక్షర్ పటేల్, రింకూ సింగ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, సిరాజ్.