News June 23, 2024

ఆగస్టు 11 వరకు రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి రైళ్లు రద్దు

image

AP: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నిడదవోలు-కడియం మధ్య ఆధునీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు ప్రధానమైన రైళ్లను అధికారులు రద్దు చేశారు. గుంటూరు-విశాఖ సింహాద్రి, విశాఖ-లింగంపల్లి జన్మభూమి, విజయవాడ-విశాఖ రత్నాచల్, గుంటూరు-విశాఖ ఉదయ్, విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్, గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఇరువైపులా రద్దు చేశారు.

Similar News

News October 9, 2024

దుర్గమ్మ చెంత కూతురు ఆద్యతో DyCM పవన్ (PHOTOS)

image

విజయవాడలోని కనక దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కూతురు ఆద్య కొణిదెలతో ఆలయానికి చేరుకొని సరస్వతి దేవిగా దర్శనమిస్తోన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించి ఇద్దరికీ పట్టు వస్త్రాలు సమర్పించారు. హోమ్ మంత్రి వంగలపూడి అనితతో కలిసి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని బహూకరించారు.

News October 9, 2024

J&Kలో కిడ్నాప్‌‌నకు గురైన జవాన్ మృతదేహం లభ్యం

image

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ అటవీ ప్రాంతంలో కిడ్నాప్‌‌నకు గురైన జవాన్ మృతిచెందారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి. టెరిటోరియల్ ఆర్మీకి చెందిన ఇద్దరు జవాన్లను ఉగ్రవాదులు నిన్న కిడ్నాప్ చేయగా, ఒక జవాన్ చాకచక్యంగా తప్పించుకున్నారు. మరో జవాన్ కోసం భద్రతా బలగాలు గాలించగా, తాజాగా మృతదేహం లభ్యమైంది.

News October 9, 2024

వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదు: మంత్రి అనిత

image

AP: ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అనిత తెలిపారు. వీఐపీల కోసం క్యూలైన్లు ఆపడం లేదని స్పష్టం చేశారు. మూడు గంటల్లోనే దర్శనం పూర్తి అవుతోందని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. మొదటి 2-3 గంటలే భక్తులు కంపార్ట్‌మెంట్లలో నిరీక్షించారని తెలిపారు. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తూ భక్తులకు దర్శన ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు.