News June 23, 2024

ట్రాన్స్‌కో ఉద్యోగులకు 3శాతం డీఏ పెంపు

image

TG: ట్రాన్స్‌కో ఉద్యోగులకు 3 శాతం డీఏను పెంచుతూ సీఎండీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. గత జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఉద్యోగులకు 8.7శాతం డీఏ ఇస్తుండగా, ఈ నెల నుంచి 11.7శాతం అమలు కానుంది. ట్రాన్స్‌కో నుంచి పెన్షన్ తీసుకునే వారికీ 3శాతం పెంపు వర్తిస్తుంది. జనవరి నుంచి మే వరకు ఉన్న బకాయిలను 11 వాయిదాల్లో ఉద్యోగులకు చెల్లిస్తారు. జూన్ నెల డీఏను వచ్చే నెల జీతంతో కలిపి ఇస్తారు.

Similar News

News November 9, 2025

చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు: బండి

image

TG: పాతబస్తీలో డ్రగ్స్ ముఠాలు రెచ్చిపోతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ మత్తులో మైనర్ అమ్మాయిలను కొందరు ట్రాప్ చేస్తున్నారు. కేరళ ఫైల్స్ సినిమా లెవల్లో హైదరాబాద్ ఫైల్స్ సినిమా నడుస్తోంది. చార్మినార్ మాటున అంతులేని అరాచకాలు జరుగుతున్నాయి. బర్త్ డే కేక్స్‌లో డ్రగ్స్ పెట్టి మైనర్ గర్ల్స్‌ను బలి చేస్తున్నారు. పాతబస్తీలో అరాచకాలకు MIM అండదండలున్నాయి’ అని ఆరోపించారు.

News November 9, 2025

భారీగా పడిపోయిన ధరలు.. రైతులకు నష్టాలు!

image

AP: అరటి రైతులకు ఈసారి కార్తీకమాసం నష్టాల్ని తీసుకొచ్చింది. ఏటా ఈ సీజన్‌లో భారీ డిమాండ్‌తో పాటు మంచి లాభాలు వచ్చేవని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రైతులు చెబుతున్నారు. కానీ ఈ ఏడాది ధరలు తగ్గి నష్టాలు మిగిలాయని వాపోతున్నారు. గత ఏడాది కర్పూర రకం అరటి గెల రూ.500 ఉండగా ఈ ఏడాది రూ.200 కూడా పలకడం లేదంటున్నారు. తుఫాను కారణంగా గెలలు పడిపోయి నాసిరకంగా మారడమూ ఓ కారణమని పేర్కొంటున్నారు.

News November 9, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ వివరాలివే

image

✒ ఎల్లుండి పోలింగ్, బరిలో 58 మంది అభ్యర్థులు
‎✒ 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు. మొత్తం 4,01,365 మంది ఓటర్లు. పోలింగ్ విధుల్లో పాల్గొననున్న 2060 మంది సిబ్బంది
‎✒ 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ఠమైన నిఘా. 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తింపు
‎✒ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల దగ్గర పారామిలిటరీ బలగాలతో బందోబస్తు
‎✒ GHMC ఆఫీస్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
✒ ఈ నెల 14న ఓట్ల లెక్కింపు, ఫలితం