News June 23, 2024
విషాదం.. సముద్రంలో ఏలూరు జిల్లా యువకులు మృతి

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరం వద్ద శుక్రవారం నలుగురు యువకులు గల్లంతు కాగా అందరూ చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. పెదవేగి మండలం దుగ్గిరాలకు చెందిన 11 మంది యువకులు సముద్ర స్నానం కోసం రామాపురం వెళ్లారు. ఈ క్రమంలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో తేజ(17), కిశోర్(18) అదే రోజు లభ్యం కాగా.. నితిన్ (18), అమల్ రాజు (18) మృతదేహాలు తాజాగా తీరానికి కొట్టుకొచ్చాయి. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News September 14, 2025
వరి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి: జేసీ

వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యాపారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కడియద్దలో పర్యటించి, వరి కోతలను పరిశీలించారు. అనంతరం రైతులు, ట్రేడర్లతో మాట్లాడి పంట ధర గురించి ఆరా తీశారు. అంతకుముందు ఉల్లిపాయల మార్కెట్‌లో ఉల్లి ధరలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహశీల్దార్ పాల్గొన్నారు.
News September 13, 2025
మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ప.గో కలెక్టర్

జిల్లాలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవారంలోని కలెక్టరేట్‌లో మాట్లాడారు. ‘స్వస్థ నారి – శసక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, వైద్య నిపుణుల సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
News September 13, 2025
పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణపై రూపొందించిన అవగాహన పోస్టర్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి అక్టోబర్ 14వ తేదీ వరకు పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచిత టీకాలు వేస్తారని ఆమె తెలిపారు. జిల్లాలోని పశువుల యజమానులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.