News June 23, 2024

హోమ్ మినిస్టర్ అనిత పర్యటనలో అపశ్రుతి..!

image

హోంమినిస్టర్‌ వంగలపూడి అనితను కలవడానికి వచ్చిన బీజేపీ నాయకుడు గాయపడినట్లు సమాచారం. శనివారం తిరుమల దర్శనార్థం హోం మినిస్టర్ వెళ్తుండగా అలిపిరి గరుడ సర్కిల్ వద్ద తిరుపతి పట్టణానికి చెందిన బీజేపీ నాయకుడు ప్రభాకర్ నాయుడు వంగలపూడి అనితను సన్మానించడానికి వచ్చారు. కాన్వాయ్‌లోని ఓ వాహనం దూసుకెళ్లి ఢీకొట్టడంతో ఆయన గాయపడగా.. రుయా ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

Similar News

News September 17, 2025

విశాఖ చేరుకున్న సీఎం చంద్రబాబు

image

సీఎం చంద్రబాబు బుధవారం విశాఖ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం సీఎం కాన్వాయ్ ఎయిర్‌పోర్ట్ నుంచి AU సాగరిక ఫంక్షన్ హాల్‌కు బయలుదేరింది. మహిళా ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ హెల్త్ క్యాంప్‌ సందర్శిస్తారు. అనంతరం AU కన్వెన్షన్ సెంటర్లో ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించే సభలో పాల్గొంటారు.

News September 17, 2025

విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

image

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్‌పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.

News September 16, 2025

విశాఖ చేరుకున్న నిర్మలా సీతారామన్

image

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాత్రి విశాఖ చేరుకున్నారు. రేపు పలు కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నారు. ఈనెల 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు కానుంది. దీంతో అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కార్యక్రమంతో పాటు స్వస్థ్‌ నారీ-సశక్త్‌ పరివార్‌ అభియాన్‌లో ఆమె పాల్గొంటారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.