News June 23, 2024
కారంచేడు: ఉద్యోగం ఆశ చూపి రూ.5.30 లక్షల మోసం

మాయగాళ్ల బారిన పడి అలేఖ్య అనే యువతి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. పోలీసుల వివరాల మేరకు.. కారంచేడుకు చెందిన జాగర్లమూడి అలేఖ్య అనే యువతి ఉద్యోగ వేటలో ఉండగా తన వాట్సప్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ఉద్యోగం ఆశచూపి వారు అడిగినంత మొత్తం రూ.5.30 లక్షలు చెల్లించింది. చివరకు ఆ గ్రూపు డిలీట్ కావడంతో అలేఖ్యకు మోసం అర్థమైంది. గ్రహించి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఎస్సై సురేష్ తెలిపారు.
Similar News
News January 21, 2026
ప్రకాశం: గీతిక.. నువ్వు సూపర్!

ప్రకాశం జిల్లా కొండపి మండలం జాల్లపాలెం పాఠశాల విద్యార్థిని రాసిన పుస్తకానికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు దక్కింది. హెచ్ఎం మంచికల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. 10వ తరగతి చదువుతున్న గీతిక 8వ తరగతిలో రాసిన కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని ‘వేదన’ పేరిట ప్రచురించారు. రచనవి భాగంలో పాఠశాల గ్రంథాలయాలకు దీపిక రాసిన పుస్తకం ఎంపికైనట్లు HM చెప్పారు.

News January 20, 2026
ఒంగోలు SP కీలక ఆదేశాలు

మహిళలు, చిన్నారుల రక్షణే లక్ష్యంగా శక్తి బృందాలు క్షేత్రస్థాయిలో మరింత పటిష్ఠంగా పని చేయాలని ప్రకాశం ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు సూచించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో డీఎస్పీలు, శక్తి బృందాలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్లు, ఈవ్ టీజింగ్ జరుగుతున్న ప్రదేశాల్లో ఏ సమస్య ఎదురైనా త్వరగా వెళ్లాలని ఆదేశించారు.