News June 23, 2024
భార్యాభర్తకు తిరుపతి పోలీసుల వేధింపులు..?
పోలీసులు తమను వేధిస్తున్నారని భార్యాభర్త వాపోయారు. మదనపల్లెకు చెందిన నితిన్, హిమజ గతంలో దొంగతనాలు చేశారు. తెలిసో తెలియక తప్పు చేశామని.. ఇప్పుడు తాము మంచిగా బతుకుతున్నామని చెప్పారు. కానీ చేయని నేరాలని ఒప్పుకోవాలంటూ తిరుపతి, కర్ణాటక పోలీసులు వేధిస్తున్నారని వాపోయారు. సమయం, సందర్భం లేకుండా తమను తీసుకెళ్లి గోళ్లు పీకడం, సిగరెట్లతో కాల్చి చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Similar News
News January 3, 2025
తిరుపతి: ఉచితాలు వద్దని TTD ఛైర్మన్ డైరీలు కొనుగోలు
ఏటా టీటీడీ గౌరవప్రదంగా అందజేసే నూతన ఏడాది డైరీ, క్యాలెండర్లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సున్నితంగా తిరస్కరించారు. సాధారణంగా ఛైర్మన్‌కు టీటీడీ ఉచితంగా 75 డైరీలు, 75 క్యాలండర్లు ఇస్తుంది. వీటిని ఆయన తిరస్కరించి.. కొన్ని డైరీలను, క్యాలెండర్లను సొంత నగదుతో కొనుగోలు చేసి సన్నిహితులకు అందజేశారు.
News January 3, 2025
చిత్తూరు: 150 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
కడప జోన్-4 పరిధిలో 150 స్టాఫ్ నర్సు పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఎంహెచ్ఎఓ సుధారాణి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఫారం పూర్తి చేసి కడపలోని ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఇతర వివరాలకు https://cfw.ap.nic.in/ను సంప్రదించాలన్నారు.
News January 2, 2025
చిత్తూరు: కానిస్టేబుళ్ల ఎంపికకు 394 మంది హాజరు
చిత్తూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కానిస్టేబుల్ల ఎంపిక కార్యక్రమం మూడోరోజు కొనసాగినట్టు పోలీసులు తెలిపారు. 599 మంది అభ్యర్థులకు 394 మంది హాజరు కాగా 163 మంది అర్హత సాధించినట్టు వారు చెప్పారు. శుక్రవారం మహిళల అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. 495 మంది హాజరుకానున్నట్టు చెప్పారు.