News June 23, 2024

T20 WC: చరిత్ర సృష్టించాడు

image

టీ20 WCలో సూపర్-8లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో మ్యాచులో ఆస్ట్రేలియా పేసర్ పాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు. వరుస బంతుల్లో(17.6, 19.1, 19.2) ముగ్గుర్ని ఔట్ చేసి ఈ టోర్నీలో రెండో హ్యాట్రిక్‌ను నమోదు చేశారు. 3 రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లోనూ ఆయన హ్యాట్రిక్ తీసిన సంగతి తెలిసిందే. దీంతో టీ20 WC చరిత్రలో రెండు హ్యాట్రిక్స్ తీసిన తొలి బౌలర్‌గా కమిన్స్ రికార్డు సృష్టించారు.

Similar News

News December 25, 2025

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు హతం.. నక్సల్స్ రహిత రాష్ట్రంగా ఒడిశా!

image

ఒడిశాలోని కందమాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. వీరిలో కేంద్ర కమిటీ సభ్యులు, నల్గొండ(D) పుల్లెంల వాసి గణేశ్ ఉయికె అలియాస్ పాక హన్మంతు ఉన్నారని తెలిపింది. 40 ఏళ్లుగా ఉద్యమంలో చురుగ్గా ఉన్న ఆయనపై రూ.1.10 కోట్ల రివార్డు ఉంది. ఒడిశా నక్సల్స్ రహిత రాష్ట్రంగా మారిందని, వచ్చే ఏడాది మార్చి 31కల్లా దేశంలో నక్సలిజాన్ని అంతమొందిస్తామని పేర్కొంది.

News December 25, 2025

GOVT శాఖల విద్యుత్ బకాయి ₹35,982 కోట్లు

image

TG: ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. TGSPDCL, NPDCLలు నోటీసులు ఇస్తున్నా ఫలితం లేకపోతోంది. సాగునీటి శాఖ ₹22,926 కోట్లు, HYD వాటర్ బోర్డు ₹7,084 కోట్లు చెల్లించాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టు విభాగం ₹5,972 కోట్లు కట్టాల్సి ఉంది. గత 5 ఏళ్లుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాగా ఈ బకాయిల వసూలు బాధ్యతను కొత్తగా ఏర్పాటుచేసిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.

News December 25, 2025

పిల్లలు త్వరగా పడుకోవాలంటే..

image

ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు లేటుగా పడుకొని ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలు ప్రతిరోజు ఒకే వేళకు నిద్రపోయేలా, ఒకే సమయానికి లేచేలా చూడాలి. దాంతో చక్కగా నిద్రపట్టి మెదడు చురుకుగా పనిచేస్తుంది. రాత్రిళ్లు పిల్లలు ఫోన్, టీవీ చూడకుండా వారికి ఆసక్తి కలిగించే కథలు చెప్పాలి. దీంతో త్వరగా నిద్రపోతారు. పిల్లలను నిద్రపుచ్చే సమయానికి గది వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలి.