News June 23, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. సర్వదర్శన కంపార్ట్‌మెంట్లు నిండి నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు వేచి ఉన్నారు. కాగా నిన్న శ్రీవారిని 74,467 మంది దర్శించుకున్నారు. 40,005 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు లభించింది.
Similar News
News January 3, 2025
ఓపెన్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్
తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు ఈ నెల 9 నుంచి 22 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చు. రూ.25 ఫైన్‌తో ఈ నెల 23 నుంచి 29 వరకు, రూ.50 లేట్ ఫీజుతో 30 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఫీజులు చెల్లించవచ్చు. ఆ తర్వాత తత్కాల్ విధానంలో ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు ఫీజు కట్టుకోవచ్చు.
News January 3, 2025
రాష్ట్రంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత విపరీతంగా ఉంది. కొమురం భీమ్ జిల్లా సిర్పూర్, గిన్నెదారిలో 6.5°C అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 6.9°C, ADB జిల్లా బేలలో 7.1°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పొగమంచు సైతం ఇబ్బంది పెడుతోంది. మరో 2 రోజుల పాటు పలు జిల్లాల్లో శీతల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
News January 3, 2025
రోహిత్ నిర్ణయంపై రవిశాస్త్రి ప్రశంసలు
ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో టెస్టు నుంచి పక్కకు తప్పుకోవడంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిల్ ఆడితే జట్టు బలంగా ఉంటుందని భావించి రోహిత్ బెంచ్‌కే పరిమితమయ్యారని అన్నారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ తీసుకున్నది గొప్ప నిర్ణయమని చెప్పారు. జట్టు కోసం రోహిత్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మెచ్చుకున్నారు.