News June 23, 2024

ఖమ్మం SR&BJNR కాలేజీలో కౌన్సెలింగ్

image

టీజీ పాలిసెట్ 2024 ప్రవేశాల కౌన్సెలింగ్ శనివారం ఖమ్మంలోని SRBJNR డిగ్రీ కళాశాలలో ప్రారంభమైందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జాకీరుల్లా తెలిపారు. ఈ నెల 25 వరకు ఈ కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. మొదటి రోజు 320 మంది విద్యార్థులకు గాను 318 మంది హాజరైనట్లు కోఆర్డినేటర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ నెల 27 వరకు వెబ్ ఆప్షన్స్, 30న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. 

Similar News

News July 7, 2025

పాలేరు జలాశయానికి చేరిన నాగార్జున సాగర్ జలాలు

image

కూసుమంచి మండలం పాలేరు జలాశయానికి ఆదివారం సాగర్ జలాలు చేరుకున్నాయి. ఖమ్మం జిల్లాలో తాగునీటి అవసరాల నిమిత్తం శుక్రవారం ఉదయం నాగార్జున సాగర్ డ్యాం నుంచి 3000 క్యూసెక్కుల నీరు విడుదల చేసిన సంగతి తెలిసిందే. మూడు రోజుల అనంతరం ఆదివారం రాత్రి జలాశయానికి చేరుకున్నాయి. ప్రస్తుతం 500 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News July 6, 2025

ఇందిరమ్మ ఇల్లు రానివారు ఆందోళన చెందొద్దు: ఖమ్మం కలెక్టర్

image

మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాబోయే రోజుల్లో మంజూరవుతాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. నిరుపేదలైన అర్హులకు దశల వారీగా ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా ఆయా సమీప రీచ్‌ల నుంచి అందిస్తున్నామన్నారు. అటు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని సూచించారు.

News July 6, 2025

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గత ప్రభుత్వం: పొంగులేటి

image

గత పాలకులు రూ.8.19 లక్షల కోట్ల అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇచ్చిన అనేక హామీలను అమలు చేశామని, రాబోయే రోజుల్లో మరికొన్ని హామీలను కూడా అమలు చేస్తామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డులు, సన్నం బియ్యం పంపిణీ, సన్నాలకు రూ.500 బోనస్, ఫ్రీ బస్సు, ఇందిరమ్మ ఇళ్ల పథకం వంటి అనేక హామీలను అమలుచేశామన్నారు.