News June 23, 2024
HYD: బొగ్గు బ్లాకుల వేలం సింగరేణి దివాలాకే: తమ్మినేని

రాష్ట్రానికి మణిహారంగా ఉన్న సింగరేణి సంస్థను దివాలా తీయించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వేలం పాట ప్రారంభించిందని CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. HYDలో ఆయన మాట్లాడారు. బొగ్గు బ్లాకులను ప్రైవేటుపరం చేసి తర్వాత సింగరేణి మూతపడేలా కేంద్రం చేస్తుందని, దానిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో చర్చించాలని కోరారు. అన్ని జిల్లాల్లో ఈనెల 28, 29న ధర్నాలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News March 10, 2026
దిల్‌సుఖ్‌నగర్‌లో ‘నిరుద్యోగుల మిలియన్ మార్చ్’

తెలంగాణ ఉద్యమాలకు నిలయమైన ఈ నేలపై మరోసారి నిరుద్యోగుల ఆగ్రహం ఉప్పొంగుతోంది. ఏడాదిలోపే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు గుస్సా మీద ఉన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన మిలియన్ మార్చ్‌కు 15 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఇవాళ ‘నిరుద్యోగ మిలియన్ మార్చ్’కు పిలుపునిచ్చారు. ఉ. 10 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌కు భారీగా తరలిరావాలన్నారు.
News March 10, 2026
HYD: గ్రేటర్‌లో గ్యాస్ మంట.. ఆరిపోతున్న పొయ్యిలు!

గ్రేటర్ HYDలో గ్యాస్ సెగ రేగుతోంది. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల సాకుతో వాణిజ్య సిలిండర్ల సరఫరాకు బ్రేక్ పడటంతో హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు బెంబేలెత్తుతున్నారు. అమాంతం పెరిగిన ధరలకు తోడు.. రీఫిల్లింగ్ గడువును 25 రోజులకు పెంచడం వ్యాపారులకు శాపంగా మారింది. డొమెస్టిక్ సిలిండర్లకే మొగ్గు చూపుతుండటంతో వాణిజ్య అవసరాలకు కొరత ఏర్పడిందని హోటల్ యజమానులు విలవిలలాడుతున్నారు.
News March 10, 2026
HYD: PF సమస్యలు ఉన్నాయా? ఇక్కడికి రండి

EPFOకు సంబంధించిన సమస్యలు ఉన్నవారు బాలానగర్ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో ఉన్న EPFO కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు సూచించారు. PF విత్‌డ్రా, నామినీ యాడ్ చేయడం, KYC అప్‌డేట్, అకౌంట్ సంబంధిత ఇతర సమస్యలను అక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు.


