News June 23, 2024
విశాఖ: మంత్రి నారా లోకేశ్‌కు లేఖ

ఐటీ రంగ అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు విశాఖ ఐటి పార్క్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఓ.నరేష్ కుమార్ లేఖ రాశారు. మిలీనియం టవర్లను 10 ప్రముఖ ఐటి కంపెనీలకు 3 సంవత్సరాలకు ఉచితంగా కేటాయించాలని, తద్వారా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హిల్ నెంబర్ 2,3లో ఉన్న పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని నూతన కంపెనీలకు 50 శాతం సబ్సిడీపై అందించాలని, నూతన ఐటీ పాలసీ అమలు చేయాలన్నారు.
Similar News
News November 11, 2025
విశాఖలో విషాద ఘటన

మద్యానికి బానిసైన కొడుకును కన్న తండ్రి హతమార్చిన ఘటన విశాలాక్షి నగర్లో చోటు చేసుకుంది. ఆరిలోవ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 6వ తేదీన మద్యానికి డబ్బులు కావాలని వై.ప్రసాద్ (36) తండ్రి లక్ష్మణరావును వేధించాడు. కోపోద్రిక్తుడైన తండ్రి కొడుకు తలపై కర్రతో బలంగా కొట్టడంతో మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని పాతిపెట్టాడు. మృతుని భార్య రాజీ ఫిర్యాదుతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
News November 10, 2025
భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు పూర్తికావాలి: కలెక్టర్

ఈ నెల 14,15వ తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు ఏర్పాట్లు 12వ తేదీ సాయంత్రం నాటికి పూర్తికావాలని అధికారులకు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ నిర్దేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. ఎక్కడా ఎలాంటి సమన్వయ లోపం రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సదస్సులో ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రులు భాగస్వామ్యం కానున్నారని సూచించారు.
News November 10, 2025
గోపాలపట్నంలో వివాహిత అనుమానాస్పద మృతి

గోపాలపట్నం సమీపంలో రామకృష్ణాపురంలో నివాసం ఉంటున్న శ్యామల అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. పది నెలల క్రితం వేపాడ దిలీప్ శివ కుమార్‌తో వివాహం కాగా తల్లిదండ్రులు భారీగానే ఇచ్చారు. సోమవారం శ్యామల చనిపోయినట్లు సమాచారం అందడంతో తల్లి వచ్చి చూసి ముఖం పైన బలమైన గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతుర్ని అల్లుడు, బంధువులే చంపేశారని ఫిర్యాదు చేశారు. మృతురాలి శ్యామల నేవిలో ఉద్యోగం చేస్తోంది.


