News June 23, 2024

HYD: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

జూన్ 24 నుంచి 29 తేదీల మధ్య జరిగే వసతి గృహ సంక్షేమాధికారి, జూన్ 30 నుంచి జులై 4 వరకు నిర్వహించే డివిజనల్ అకౌంట్స్ అధికారి నియామక పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. అందరూ ఈ విషయాన్ని గమనించాలని, నిబంధనలు పాలించకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Similar News

News September 18, 2025

BREAKING: మైసమ్మగూడ చెరువులో తండ్రి, కూతురు మృతి

image

మేడ్చల్ జిల్లాలోని మైసమ్మగూడ చెరువులో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. గురువారం ఉదయం ఇది గమనించిన స్థానికులు పేట్‌బషీరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు, హైడ్రా సిబ్బంది మృతదేహాలను వెలికితీశారు. మృతులు బహదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అశోక్ (50), కూతురు దివ్య(5)గా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 18, 2025

HYD: బ‌తుక‌మ్మ‌, దసరా కోసం ప్రత్యేక బస్సులు

image

బ‌తుక‌మ్మ‌, దసరాకు ప్రయాణికుల కోసం TGSRTC 7,754 ప్రత్యేక బస్సులు నడపనుంది. ఈ నెల 20 నుంచి అక్టోబ‌ర్ 2 వరకు స్పెష‌ల్ స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయి. MGBS, JBS, CBS, KPHB, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ బస్సులు నడపనున్నట్లు TGSRTC ప్రకటించింది.

News September 18, 2025

HYD: క్షీణించిన అశోక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

image

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యంగా క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.