News June 23, 2024
HYD: శంషాబాద్‌లో దారుణం

శంషాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. RGIA పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్‌కు చెందిన దంపతులు కూలీలు. వారికి కూతురు ఉంది. ఈక్రమంలో అనారోగ్యంతో భర్త 2నెలల క్రితం మృతిచెందాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భార్య ఇటీవల పనుల కోసం బయటకు వెళ్లగా ఇంట్లో బాలిక ఒంటరిగా ఉంది. అదే రోజు వరుసకు చిన్నాన్న అయ్యే యాకేశ్ ఇంట్లోకి వెళ్లి బాలిక(14)ను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో కేసు నమోదైంది.
Similar News
News January 9, 2026
HYD ట్రాఫిక్ వ్యవస్థలో AI.. మీ కామెంట్?

HYDలో ట్రాఫిక్ ఉల్లంఘనకు చెక్ పెట్టేందుకు AI రాంగ్ వే డిటెక్షన్ వ్యవస్థను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాంగ్ రూట్‌లో వెళ్లినా, హెల్మెట్ లేకపోయినా ఈ కెమెరాలు కనిపెట్టేస్తాయి. కేవలం జరిమానాల మీద దృష్టి పెట్టి, రోడ్ల దుస్థితిని గాలికొదిలేస్తే ప్రయోజనం ఏంటి? అని విమర్శలొస్తున్నాయి. టెక్నాలజీతో భద్రత పెరగడం మంచిదే.. కేవలం చలానాల వసూలు యంత్రంగా AI మారకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?
News January 9, 2026
రీల్స్ వైరలా కావాలా? జూబ్లీహిల్స్ వచ్చేయండి!

మీరు తీసే ట్రావెల్ వీడియోలు వైరల్ అవ్వడం లేదని ఫీలవుతున్నారా? FTCCI టూరిజం కమిటీ ఆధ్వర్యంలో JAN 17న జూబ్లీహిల్స్‌లోని ‘క్రియేటర్ వర్స్’లో రీల్ మేకింగ్ బూట్‌క్యాంప్ జరుగుతోంది. ₹500లకే షూటింగ్, ఎడిటింగ్ ట్రిక్స్ నేర్చుకోవచ్చు. అద్భుతమైన రీల్స్ చేసి ₹50,000 నగదు బహుమతులు గెలుచుకునే ఛాన్స్ మీ సొంతం. మీ స్మార్ట్‌ఫోన్ తీయండి, క్రియేటర్ అయిపోండి! మరిన్ని వివరాలకు 98480 42020లో సంప్రదించండి.
News January 9, 2026
మూసీ ప్రాజెక్ట్‌కు 200 ఎకరాల అదనపు సేకరణ

మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాపుఘాట్ పరిసరాల్లోని సుమారు 200 ఎకరాల డిఫెన్స్ భూమిని సేకరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భూమి లభిస్తే, నది వెడల్పును పెంచడంతో పాటు అక్కడ భారీ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ హబ్‌ను, అంతర్జాతీయ స్థాయి వాక్-వేలను నిర్మించవచ్చని ఓ అధికారులు Way2News కు తెలిపారు.


