News June 23, 2024
లోక్‌సభలో టీడీపీ విప్‌గా బాలయోగి తనయుడు

AP: లోక్‌సభలో టీడీపీ విప్‌గా అమలాపురం ఎంపీ గంటి హరీశ్ మాథుర్‌ని పార్టీ అధినేత చంద్రబాబు నియమించారు. గతంలో హరీశ్ తండ్రి బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. సభను హుందాగా నడిపించి అగ్ర నాయకుల మెప్పు పొందారు. ఇప్పుడు ఆయన తనయుడు హరీశ్‌కి విప్ బాధ్యతలు అప్పగించడంతో తగిన ప్రాధాన్యం ఇచ్చినట్లయిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో 3.42 లక్షల ఓట్ల మెజార్టీతో హరీశ్ ఎంపీగా గెలుపొందారు.
Similar News
News February 3, 2026
మార్కెట్లో మాయాజాలం.. గమనించారా?

వంట నూనెలు, పలు రకాల పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. నెల రోజుల్లోనే సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరు రూ.150 నుంచి రూ.167కు చేరింది. వేరుశనగ నూనె రూ.180కు, పామాయిల్ ప్యాకెట్ రూ.120కు పెరిగింది. అటు వేరుశనగ పలుకులు కిలో రూ.140 నుంచి ఏకంగా రూ.200కు దూసుకెళ్లాయి. మరోవైపు కొన్ని కంపెనీలు మాయాజాలంగా ధర పెంచకుండా వంట నూనె లీటరు (910 గ్రాములు)కు బదులు 850, 800 గ్రాముల ప్యాకెట్లను తీసుకొస్తున్నాయి.
News February 3, 2026
ఇండియాలో ఫార్ములా వన్ రీఎంట్రీ!

ఇండియాలోకి ఫార్ములా వన్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై కేంద్రం, ఫార్ములా వన్ యాజమాన్యం మధ్య ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్లు క్రీడా శాఖ వెల్లడించింది. 2011లో నోయిడా సర్క్యూట్‌లో దేశంలోనే తొలిసారి F1కార్లు పరుగులు తీశాయి. 2013లో చివరి సారిగా రేసు జరిగింది. భారీ పన్నులు, ఇతర సమస్యలతో ఇండియాకు F1 దూరమైంది. 2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు జరిగిన విషయం తెలిసిందే.
News February 3, 2026
బంగ్లాదేశ్ మాజీ ప్రధానికి 10 ఏళ్ల జైలు శిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు<<18311087>> మరో షాక్ <<>>తగిలింది. ఢాకా స్పెషల్ జడ్జస్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. రెండు వేర్వేరు అవినీతి కేసులకు సంబంధించి ఈ తీర్పునిచ్చింది. ఒక్కో కేసుకు 5 ఏళ్ల చొప్పున శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. పుర్బాచోల్‌లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్టు కింద ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్న అభియోగాలతో హసీనా, ఆమె కుటుంబ సభ్యులకు శిక్ష ఖరారు చేసింది.


