News June 23, 2024
కాసేపట్లో వర్షం

TG: ఆదిలాబాద్, జనగామ, కామారెడ్డి, KNR, ఆసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, RR, మేడ్చల్-మల్కాజిగిరి, WGL, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. సుమారు 40KM వేగంతో గాలులు వీయొచ్చని పేర్కొంది. మరోవైపు HYDలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. వనస్థలిపురం, LBనగర్, హయత్నగర్లో వరదనీరు రోడ్లపై చేరి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Similar News
News November 8, 2025
CSIR-IIIMలో ఉద్యోగాలు

CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్(<
News November 8, 2025
కోళ్ల దాణా నిల్వ.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడిగా ఉన్న దాణాను చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News November 8, 2025
భారత్, ఆస్ట్రేలియా మ్యాచుకు అంతరాయం

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న ఐదో టీ20 నిలిచిపోయింది. బ్యాడ్ వెదర్, వర్షం వచ్చే అవకాశం ఉండటంతో అంపైర్లు మ్యాచును నిలిపివేశారు. ప్రస్తుతం టీమ్ ఇండియా స్కోర్ 4.5 ఓవర్లలో 52-0గా ఉంది. అభిషేక్ 23, గిల్ 29 రన్స్ చేశారు.


