News June 23, 2024

మా వెబ్‌సైట్ హ్యాక్ కాలేదు: NTA

image

NEET పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) వెబ్‌సైట్ హ్యాక్ అయిందంటూ జరుగుతున్న ప్రచారంపై సంబంధిత సంస్థ స్పందించింది. తమ సైట్, వెబ్ పోర్టలన్నీ భద్రంగా ఉన్నాయని పేర్కొంది. హ్యాకింగ్ ప్రచారం తప్పుదోవ పట్టించేదని, దాన్ని నమ్మొద్దని సూచించింది. కాగా నీట్ పేపర్ లీక్ కావడంపై NTAపై తీవ్ర విమర్శలొస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News October 9, 2024

JOE ROOT: ‘గే’ అని గేలి చేసినా..!

image

టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ అన్‌స్టాపబుల్‌గా దూసుకెళ్తున్నారు. గత నాలుగేళ్లలో అత్యుత్తమ ఫామ్ ప్రదర్శించి ఏకంగా 18 సెంచరీలు బాదారు. కాగా రూట్ 2021కు ముందు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తరచూ ఆయనను ప్రత్యర్థులు ‘గే’ అంటూ ఎగతాళి చేసేవారు. ఆయన వాటినేం పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టేవారు. అతడిని ‘గే’ అని పిలిచినందుకు వెస్టిండీస్ బౌలర్ గాబ్రియేల్ 4 మ్యాచ్‌ల నిషేధం కూడా ఎదుర్కొన్నారు.

News October 9, 2024

3 రోజుల్లోనే ఖాతాల్లోకి డబ్బులు: మంత్రి

image

TG: ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండ(D) అర్జాలబావి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సన్న రకాల సాగును ప్రోత్సహించేందుకే రూ.500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. రుణమాఫీ కాని రైతులకు వారం రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.

News October 9, 2024

కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్

image

రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. ‘ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్‌’కు గాను డేమిస్ హసాబిస్, జాన్ ఎం.జంపర్‌‌లకు, ‘కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్’కు గాను డేవిడ్ బెకర్‌కు సంయుక్తంగా నోబెల్ ప్రైజ్ వచ్చింది.