News June 23, 2024

NZB: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

image

నిజామాబాద్ నగరంలోని శివాజీ నగర్ ప్రాంతంలోని డ్రైనేజీలో (35) వ్యక్తి మృతదేహం ఒంటి నిండా గాయాలతో ఆదివారం లభ్యమైంది. అతడు డ్రైనేజీలో పడి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి వర్షం ధాటికి అతడు డ్రైనేజీలో పడి మృతి చెందాడా.? లేదా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు సదరు వ్యక్తిపై దాడి చేసి డ్రైనేజీలో పడేశారా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News September 14, 2025

NZB: STU ఏడు మండలాల కార్యవర్గ సభ్యుల ఎన్నిక

image

నిజామాబాద్ జిల్లాలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) ఏడు మండలాల కార్యవర్గ సభ్యులను ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎడపల్లి మండల అధ్యక్షుడిగా యూసుఫ్, ప్రధాన కార్యదర్శిగా భూపతి ఎన్నికయ్యారు. నవీపేట అధ్యక్షుడిగా రవీందర్, ప్రధాన కార్యదర్శిగా గణేష్ ఎంపికయ్యారు. అదే విధంగా నిజామాబాద్ నార్త్, సౌత్, డిచ్‌పల్లి, ఆలూరు, మోపాల్ మండలాల నూతన అధ్యక్ష, కార్యదర్శులను కూడా ఎన్నుకున్నారు.

News September 14, 2025

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ

image

జాతీయ మెగా లోక్-అదాలత్ లో 7,444 కేసులలో రాజీ జరిగిందని NZB CP సాయి చైతన్య జాతీయ మెగా లోక అదాలత్ లో భాగంగా వివిధ కేసులలో రాజీ పడి పరిష్కారం అయినందునకు నిజామాబాద్ జిల్లాకు 4వ స్థానం దక్కిందని, సైబర్ నేరగాళ్ల చేతిలో కోల్పోయిన రూ.42,45,273-00ను సైతం తిరిగి సైబర్ బాధితులకు అందజేసినట్లు వివరించారు. జిల్లాను అగ్రగామిగా ఉంచడంలో కృషి చేసిన సిబ్బందిని ఆయన అభినందించారు.