News June 23, 2024

SA-Wపై భారత్ ఘన విజయం.. సిరీస్ క్లీన్‌స్వీప్

image

భారత మహిళల జట్టు అదరగొట్టింది. సౌతాఫ్రికాపై మూడో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. తొలుత దక్షిణాఫ్రికా 215/8 స్కోర్ చేయగా, టీమ్ ఇండియా 40.4 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. స్మృతి మంధాన 90, షఫాలీ వర్మ 25, ప్రియా పునియా 28, హర్మన్‌ప్రీత్ 42, జెమీమా 19* రన్స్ చేశారు. దీప్తి శర్మ, అరుంధతీరెడ్డి చెరో 2 వికెట్లు, శ్రేయాంక, పూజా వస్త్రాకర్ చెరో వికెట్ తీశారు.

Similar News

News January 19, 2026

రబీ వరిలో పెరిగిన తెగుళ్లు – కట్టడికి కీలక సూచనలు

image

తెలుగు రాష్ట్రాల్లో వరి పంట వివిధ దశల్లో ఉంది. ప్రస్తుతం పెరిగిన చలి, వాతావరణ పరిస్థితుల వల్ల పంటలో పురుగులు, చీడపీడల ఉద్ధృతి బాగా పెరిగింది. ప్రధానంగా వరిలో కాండం తొలిచే పురుగు, సుడిదోమ, అగ్గి తెగులు, కాండం కుళ్లు/దుబ్బు కుళ్లు, జింకు లోపం కనిపిస్తున్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే పంట ఎదుగుదల తగ్గి, దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ తెగుళ్ల కట్టడికి కీలక సూచనల కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.

News January 19, 2026

మా కరెంట్‌తోనే భారత్‌లో AI సేవలు: US

image

భారత్‌లో AI సేవల కోసం అమెరికన్లు డబ్బులు చెల్లిస్తున్నారని ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఆరోపించారు. USలోని కరెంట్‌తోనే చాట్‌జీపీటీ వంటి ప్లాట్‌ఫామ్‌లు పనిచేస్తున్నాయని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భారత్, చైనా వంటి దేశాల్లో పెద్ద సంఖ్యలో వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్యం, రష్యాతో సంబంధాలపై భారత్ టార్గెట్‌గా నవారో గతంలోనూ పలు విమర్శలు చేశారు.

News January 19, 2026

IIM లక్నోలో 38పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

IIM లక్నోలో 38 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీఏ, పీజీ, డిగ్రీ( హార్టీకల్చర్/అగ్రికల్చర్), బీటెక్/బీఈ, ఎంటెక్/ఎంఈ /ఎంసీఏ, CA/CMA, B.Lib.Sc/M.Lib.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iiml.ac.in/