News June 23, 2024
పాక్ పార్లమెంటులోనూ బాబర్ సేనపై ఆగ్రహం

T20 WCలో పేలవ ప్రదర్శనతో పాకిస్థాన్ లీగ్ దశలోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ దేశంలో ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. జట్టుకు మిగిలి ఉన్న కాస్తో కూస్తో పరువును కూడా తాజాగా పాక్ పార్లమెంటు తీసేసింది. బాబర్ సేనపై ఎంపీలే విమర్శనాస్త్రాలు సంధించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ తరహాలోనే బాబర్ కూడా ఓటమికి కారణాలు వెతుక్కోవాలని, అనంతరం ఇతరులను బాధ్యుల్ని చేయాలని ఎద్దేవా చేశారు.
Similar News
News January 31, 2026
OTTలోకి ‘MSVPG’.. అప్పుడేనా?

చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వచ్చి సూపర్ హిట్ అయిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. OTT హక్కులను జీ5 దక్కించుకోగా FEB 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు పేర్కొంటున్నాయి. JAN 12న రిలీజైన మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.360కోట్ల గ్రాస్ వసూలు చేసిన విషయం తెలిసిందే. అటు సంక్రాంతికి వచ్చిన <<19000195>>రాజాసాబ్<<>>, <<19002366>>నారీనారీ నడుమ మురారీ<<>> 0TT స్ట్రీమింగ్ డేట్లు ఫిక్స్ అయ్యాయి.
News January 31, 2026
ఇరాన్ వైపు భారీ యుద్ధ నౌకల కాన్వాయ్.. ట్రంప్ డెడ్‌లైన్ వార్నింగ్!

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మేం ఇరాన్ వైపు భారీ యుద్ధ నౌకల సమూహాన్ని పంపుతున్నాం. వారితో డీల్ కుదుర్చుకోవాలని ఆశిస్తున్నాం. వారు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో చూద్దాం’ అని హెచ్చరించారు. న్యూక్లియర్ డీల్ కోసం తాను ఇప్పటికే ఒక డెడ్‌లైన్ విధించినట్లు చెప్పారు. అది ఎప్పటి వరకు అనేది మాత్రం బయటకు వెల్లడించలేదు.
News January 31, 2026
తండ్రి కానిస్టేబుల్.. కూతురు డీఎస్పీ

AP: తాత, తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న ఆమె త్వరలో ఖాకీ డ్రెస్ వేసుకోనున్నారు. ప.గో(D) పాలకొల్లుకు చెందిన లక్ష్మీఅంజన తాజా గ్రూప్-1 ఫలితాల్లో DSPగా ఎంపికయ్యారు. ఆమె తండ్రి దివాకర్ భీమవరం PSలో రైటర్ కాగా, తల్లి లత ప్రైవేటు టీచర్. లక్ష్మీఅంజన తాత కూడా కానిస్టేబుల్‌గా సేవలందించారు. కూతురు DSPగా ఎంపికై గర్వపడేలా చేసిందని పేరెంట్స్ ఆనందపడుతున్నారు. IPS అవ్వడమే టార్గెట్ అని లక్ష్మీఅంజన తెలిపారు.


